Movie News

నెగిటివ్ సెంటిమెంటుని రజని దాటేస్తారా

నిన్న ట్రైలర్ చూశాక అభిమానులకు కలిగిన సందేహం ఇదే. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న లాల్ సలామ్ చూసేందుకు ఏవైనా కారణాలు చెప్పమంటే రెండే గుర్తొస్తాయి. ఒకటి రజినీకాంత్. రెండు ఏఆర్ రెహమాన్. క్రేజీ కాంబినేషన్ ఉన్నా సరే ఆశించిన స్థాయిలో దీని మీద బజ్ రావడం లేదు. అరగంటకు పైగానే సూపర్ స్టార్ పాత్ర ఉంటుందని టీమ్ చెబుతున్నా ఆ మేరకు హైప్ పెరుగుతున్న సూచనలు లేవు. తమిళంలోనే అంతంత మాత్రంగా ఉంటే ఇక తెలుగులో సంగతి వేరే చెప్పాలా. ఇక్కడ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న విషయం మరొకటి ఉంది. అదే నెగటివ్ సెంటిమెంట్.

రజనీకాంత్ గెస్ట్ రోల్స్ చేసిన తమిళ, హిందీ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఒక్క పెదరాయుడు మాత్రమే రికార్డులు నమోదు చేసింది తప్పించి మిగిలినవన్నీ సోసోనే. 1993లో వల్లి అనే చిత్రంలో రజని ఒక కీలక పాత్ర పోషించారు. ఇక్కడ విజయగా అనువదించారు. అస్సలు ఆడలేదు. 2008లో కుసేలన్ రీమేక్ కథానాయకుడులో జగపతిబాబు ఫ్రెండ్ గా నటుడి క్యారెక్టరే చేశారు. కానీ ఫలితం ఫ్లాప్. షారుఖ్ ఖాన్ అడిగాడని రా వన్ లో రోబో గెటప్ లో అలా కొన్ని నిముషాలు కనిపిస్తారు. అంతకు ముందు హిందీలో చాలానే ఉన్నాయి ఏవీ గుర్తించుకునే రేంజ్ లో వెళ్ళలేదు.

ఇప్పుడు లాల్ సలామ్ వంతు వచ్చింది. నిజానికి ఇందులో హీరో విష్ణు విశాల్. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన సమస్యని క్రికెట్ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించే ముస్లిమ్ పెద్దమనిషిగా రజనీకాంత్ కనిపిస్తారు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఉంటుందని టాక్. బిజినెస్ కోసం ట్రైలర్ లో ఎక్కువగా హైలైట్ చేశారు కానీ కేవలం ఆయన్ను నమ్ముకుని వెళ్లకూడదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా అంచనాల విషయంలో వెనుకబడ్డ లాల్ సలామ్ కు రజని కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పెట్టారు.

This post was last modified on February 6, 2024 3:04 pm

Share

Recent Posts

వాళ్ళముందు మన సంస్కృతిని తక్కువ చెయ్యను: కీర్తి సురేష్

కొన్ని రోజుల ముందు ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక చిట్ చాట్‌లో.. రాధిక ఆప్టే తెలుగు…

1 hour ago

ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగ‌… ఆ ఎమ్మెల్యే రాజీనామా?

ఏపీ బీజేపీలో కొన్నాళ్లుగా అసంతృప్తితోనే నాయ‌కులు ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఏం జ‌రుగుతోందో.. త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని కొన్నాళ్లుగా…

2 hours ago

పారిశ్రామిక రంగంలో చంద్రబాబు ఎక్స్ ప్రెస్ స్పీడ్

భారతదేశ పారిశ్రామిక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ప్రెస్ బుల్లెట్ వేగంతో ముందుకు దూసుకొని…

2 hours ago

రాములమ్మని వాడుకోవడం తెలివైన ఐడియా

పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…

12 hours ago

ఇది వింటే ఇక జన్మలో కాపీ కొట్టరు

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…

12 hours ago

ఏఐని గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…

12 hours ago