విడుదలై యాభై రోజులు దాటినా, తొమ్మిది వందల కోట్లు వచ్చేసి ఓటిటిలో రిలీజై నెట్ ఫ్లిక్స్ రికార్డులు బద్దలు కొడుతున్నా యానిమల్ మీద చర్చలు ఆగడం లేదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన స్టాండ్ మీద స్థిరంగా నిలబడి సహేతుకంగా లేని విమర్శలను చాలా బలంగా తిప్పి కొడుతున్నాడు. ఇప్పటికే అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్లకు బదులుగా మీ ఆయన దిల్ సినిమా పాటలో అమ్మాయిలను ఎగతాళిగా చేసినప్పుడు మీరు చూడలేదా అంటూ రివర్స్ కౌంటర్ ఇవ్వడం తెలిసిన విషయమే. దీనికి బదులుగా అమీర్ సంజాయిషీ చెప్పిన పాత వీడియోని బయటికి తీశారు. ఇవాళ కిరణ్ రావు నేను అన్నది యానిమల్ ని కాదని అసలా సినిమానే చూడలేదని, సందీప్ ఎందుకు అలా అనుకున్నారో తెలియదని చెప్పడం మరో ట్విస్ట్.
తాజాగా సందీప్ వంగా సీనియర్ రచయిత జావేద్ అక్తర్ చేసిన తీవ్ర విమర్శకు సమాధానం తనదైన శైలిలో ఇవ్వడం వైరలవుతోంది. యానిమల్ లో హీరోని విపరీతంగా చూపించారని, భార్యనైనా సరే కొట్టే రీతిలో హింస ప్రేరేపించారని ఆయన అన్న విషయం తెలిసిందే. దీనికి సమాధానం మళ్ళీ కొత్తగా ఇచ్చిన సందీప్ ముందు జావేద్ అక్తర్ కొడుకు ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూడాలని, ప్రపంచంలో ఉన్న బూతులన్నీ అందులో జొప్పించారని, తెలుగు డబ్బింగ్ లో వాటిని విన్నప్పుడు ఇంకా దారుణంగా అనిపించాయని దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజానికి సందీప్ వంగా చెంప మీద కొట్టినట్టు అడిగాడు. ఎందుకంటే మీర్జాపూర్ లో విచ్చలవిడి సెక్స్, బూతులు మితిమీరి ఉన్నాయి. ఏ మాత్రం ఆమోదయోగ్యం కానీ వివాహేతర సంబంధాలను, హింసని విపరీతంగా చూపించారు. సహ నిర్మాతల్లో ఒకడైన ఫర్హాన్ అక్తర్ మరి తండ్రికి చూపించకుండానే అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశాడా అంటే ఏమని సమాధానం వస్తుందో చూడాలి. సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ లో జెండా పాతడం సహించలేక ఇలా విరుచుకుపడుతున్నారో లేక పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు తాము చేసేది మర్చిపోయి ఇలా టార్గెట్ చేస్తున్నారో సదరు విమర్శకులకే తెలియాలి.
This post was last modified on February 5, 2024 9:36 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…