బాలకృష్ణ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా గత ఏడాది దసరా విజేతగా నిలిచిన భగవంత్ కేసరి రీమేక్ కోసం ఇతర భాషల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళ కన్నడలో డిమాండ్ అధికంగా ఉందని ఇన్ సైడ్ టాక్. రాజకీయ ప్రవేశానికి ముందు డివివి దానయ్య నిర్మించబోయే తన చివరి సినిమాకు ఈ కథ బాగుంటుందని విజయ్ అభిప్రాయపడ్డాడట. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమెను జీవితంలో కొత్త స్థాయికి తీసుకునే బాలయ్య పాత్ర విజయ్ కి విపరీతంగా నచ్చిందని, ఆ కారణంగానే కొన్ని మార్పులతో తన ఇమేజ్ కు తగ్గట్టు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట.
ఇంకా తుది నిర్ణయమైతే తీసుకోలేదని సమాచారం. రిలీజైన టైంలోనే దీని గురించి ప్రశంసిస్తూ అనిల్ రావిపూడి, బాలయ్యలకు ఫోన్ చేసి మాట్లాడాడనే వార్త చెన్నై వర్గాల్లో తిరిగింది. ఒకవేళ తాను వద్దనుకుంటే ఇదే ప్రతిపాదన రజనీకాంత్ దగ్గరకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడున్న బిజీలో ఆయన చేయడం డౌటే. కన్నడలో శివరాజ్ కుమార్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. అసలే తనకు బాలకృష్ణ ఘాడమైన స్నేహం ఉంది. నిజంగా చేయాలనుకుంటే హక్కులు దక్కించుకోవడం క్షణాల్లో పని. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నందున నిర్ణయం వెలువడలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates