‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‍గా దర్శకుడు కళ్యాణ్‍కృష్ణ ‘బంగార్రాజు’ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున తాతగా, నాగచైతన్య మనవడిగా అదే స్టయిల్లో కొత్త కథ ఒకటి సిద్ధం చేసాడు. లాక్ డౌన్‍కి ముందు నాగార్జున ఆ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించారు కానీ ఇప్పుడా సినిమా ప్రస్తావన రావడం లేదు. అయితే ‘బంగార్రాజు’ కోసం అనుకున్న తాత పాత్ర అనుకోకుండా ‘బిగ్‍బాస్ 4’లోకి వచ్చేసింది.
బిగ్‍బాస్ హోస్ట్ అంటే సూటు, బూటు వేసుకుని స్టయిలిష్‍గా కనిపించడమే ఆనవాయితీ. దానిని గత ఏడాది నాగార్జున బ్రేక్ చేసి తన పూల చొక్కాలు, టీ షర్టులతో అలరించారు. ఈసారి ఏకంగా స్టేజీపై ద్విపాత్రాభినయమే చేసేసారు. ఈ తాత క్యారెక్టర్‍ని పెట్టాలనే ఐడియాని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఆ క్యారెక్టర్ తాలూకు సీన్స్, డైలాగ్స్ అన్నీ కూడా కళ్యాణ్‍కృష్ణ దర్శకత్వంలోనే చిత్రీకరించారు. మరి ఈ తాత పాత్ర కేవలం ఫస్ట్ ఎపిసోడ్ వరకేనా లేదా ప్రతి వారం కంటిన్యూ అవుతుందా అనేది తెలియదు. ఈ క్యారెక్టర్ ఇలాగే కొనసాగి, క్లిక్ అయితే బంగార్రాజు ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కుతుందేమో. లేదంటే కళ్యాణ్‍కృష్ణ తన బంగార్రాజుని ఇలా బిగ్‍బాస్‍లో గెస్ట్ అప్పీయరెన్స్ లో చూసుకుని సంతృప్తి పడాల్సిందే.
This post was last modified on September 7, 2020 8:32 pm
విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ..…
అసలే చిన్న కుమారుడు, ఆపై అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వైనం.. అలాంటి కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిస్తే... ఏ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై…
సినిమాల్లో గూఢచారులంటే ప్రేక్షకులకు భలే క్రేజు. సూపర్ స్టార్ కృష్ణ 'గూఢచారి 116'తో మొదలుపెట్టి నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి…
ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం…
సజ్జల రామకృష్ణారెడ్డి... అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది.…