ఇప్పుడు తగ్గించేశారు కానీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగార్జున హిందీ సినిమాలు చాలానే చేశారు. వాటిలో ఫుల్ లెన్త్ తో పాటు గెస్టు రోల్స్ కూడా ఉన్నాయి. 1998లో వచ్చిన అంగారేలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. పూజా భట్, సోనాలి బెంద్రే హీరోయిన్లుగా నటించగా బాక్సాఫిస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులో రౌడీ పేరుతో డబ్బింగ్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పాత మిత్రులను కలిపేందుకు దర్శకుడు నవీన్ ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. లవ్ యాక్షన్ రొమాన్స్ పేరుతో ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఒకవేళ అక్షయ్ కనక చేయలేని పరిస్థితిలో ఉంటే నెక్స్ట్ ఆప్షన్ గా సంజయ్ దత్ వైపు చూస్తున్నారట. తనతో కూడా నాగ్ కు మంచి బాండింగ్ ఉంది. కేవలం ఈ స్నేహం కారణంగానే చంద్రలేఖలో కొన్ని నిముషాలు మాత్రమే కనిపించే పిచ్చివాడి పాత్రకు సంజయ్ దత్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. అడగాలే కానీ నో అనే ఛాన్స్ ఉండకపోవచ్చు. నెగటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి అక్షయ్ కంటే సంజయ్ దత్ కే బాగా సూటవ్వొచ్చు. ఇదీ కుదరకపోతే ఇమ్రాన్ హష్మీ, బాబీ డియోల్ ని కూడా అడుగుతారట. సో ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు.
బాలీవుడ్ లో నాగార్జునకున్న కనెక్షన్ల వల్ల ఎవరినో ఒకరిని ఒప్పించడం కష్టం కాదు. నా సామిరంగతో హిట్టు కొట్టిన కింగ్ కి అదింకా పెద్ద స్థాయికి వెళ్లలేదనే చిన్న అసంతృప్తి అయితే ఉంది. సోగ్గాడే చిన్ని నాయనా రికార్డులను బ్రేక్ చేస్తుందనుకున్నారు కానీ సాధ్యపడలేదు. హనుమాన్ తాకిడిని ఈ మాత్రం నిలవడమే గొప్పని చెప్పొచ్చు. ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల మాఫియా డ్రామాలో నటిస్తున్న నాగార్జున వచ్చే సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసే తీరాలనే పట్టుదలతో ఉన్నారు. కొత్త ఏడాదిలో మంచి బోణీ కావడంతో తిరిగి ట్రాక్ లో పడ్డట్టేనని అభిమానులు సంబరపడుతున్నారు.
This post was last modified on February 5, 2024 2:52 pm
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…