బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు నిన్న విడుదలైంది. చిన్న సినిమాలతో పోటీ భారీగా ఉన్నా కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద ధైర్యమే చేశాడు. దీని కోసం ఏకంగా నిర్మాతగా మారి ఉన్నవి అమ్మేసి మరీ కోట్ల పెట్టుబడి పెట్టినట్టు పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన దగ్గర ప్రమోషన్లకు డబ్బులు లేవని, దయచేసి థియేటర్లకు రమ్మని దీనంగా వేడుకున్న వీడియో వైరలయ్యింది. కట్ చేస్తే బూట్ కట్ బాలరాజుకి ఓపెనింగ్స్ రాలేదు. ఒక్క అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మాత్రమే ఆడియన్స్ ని రప్పించింది కానీ మిగిలినవన్నీ సోసోగానే ఉన్నాయి.
తన సినిమాకొచ్చిన స్పందన చూసి సోహైల్ బాధ మరింత ఎక్కువయ్యింది. థియేటర్లలో జనం లేరు. టాక్ ఏమైనా ఆశాజనకంగా ఉందా అంటే అదీ అంతంతమాత్రమే. బిగ్ బాస్ టైంలో వేల మంది కామెంట్లతో తన పేరుని హోరెత్తించారని, మరిప్పుడు ఎందుకు సినిమా చూడరని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కానీ వాస్తవం చేదుగా ఉంటుంది. ప్రేక్షకులు జాలిపడి టికెట్లు కొనరు. తమ డబ్బులకు న్యాయం చేసే మ్యాటర్ మూవీలో ఉందంటే హీరో ఎవరని కూడా పట్టించుకోరు. బలగం కావొచ్చు హనుమాన్ అవ్వొచ్చు. స్పందించే విధానంలో ఎలాంటి భేదభావాలు ఉండవు. ఎన్నోసార్లు ఋజువైన సత్యమిది.
ఒకవేళ బూట్ కట్ బాలరాజుకి పాజిటివ్ టాక్ వస్తే మెల్లగా అయినా సరే జనం వస్తారు. కానీ అంత విషయం ఉందనే మాట రప్పించుకోవాలి. అంతే కానీ రండయ్యా రండమ్మా అంటే వినిపించుకోరు. బిగ్ బాస్ షో వేరు. టీవీలో, ఓటిటిలో ఫ్రీగా చూసే వ్యవహారం కాబట్టి దాని రీచ్ వేరే. పైగా రియాలిటీ షో ఫాలోయింగ్ ని సినిమాకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ప్రపంచంలో ఏ భాషలో బిగ్ బాస్ షో చూసినా ఇదే చరిత్ర ఉంటుంది. సో ఫైనల్ గా మనం ఎంచుకున్న కథలు, దర్శకుడి విషయంలో జాగ్రత్తగా ఉండకుండా కేవలం సింపతీ మీద పబ్లిక్ థియేటర్లకు వస్తారనుకోవడం అమాయకత్వం.
This post was last modified on February 3, 2024 10:40 am
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…