యానిమల్ బ్లాక్ బస్టర్ తో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో చర్చగా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మీద బాలీవుడ్ మీడియాలో వెరైటీ ప్రచారాలు జరుగుతున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఒక యాక్షన్ డ్రామా చెప్పాడని, గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలో షూటింగ్ మొదలుపెట్టొచ్చని వాటిలో మొదటిది. షారుఖ్ ఖాన్ తో చేతులు కలపనున్న కబీర్ సింగ్ డైరెక్టర్ అంటూ ఇంకో వర్గం పబ్లిసిటీ షురూ చేసింది. ఈ రెండూ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. సల్మాన్ ప్రస్తుతం పంజా ఫేమ్ విష్ణువర్ధన్ తో ది బుల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొత్త కథలు వినే పరిస్థితి దగ్గర్లో లేనట్టే.
ఇక షారుఖ్ ఖాన్ వరసగా ఒకే ఏడాదిలో మూడు సినిమాలు ఇచ్చేసరికి రెస్ట్ ,మోడ్ లోకి వెళ్ళిపోయాడు. త్వరలో గుడ్ న్యూస్ చెబుతా అంటున్నాడు కానీ ఎవరి కాంబో అనేది సస్పెన్స్ పెట్టాడు. సో ఏది వచ్చినా గాసిప్పే. సందీప్ వంగా విషయానికి వస్తే తనకు రెండు కీలక బాధ్యతలు ఉన్నాయి. ఒక యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పూర్తి చేయడం. ప్రస్తుతం ప్రణయ్ వంగా టీమ్ ఆ బాధ్యత మీదే ఉంది. సందీప్ ఇచ్చిన సూచనల ఆధారంగా స్టోరీకి ఒక రూపం తెచ్చే పనిలో ఉందట. ఇక ప్రభాస్ స్పిరిట్ అనే మహాయజ్ఞం ముందుంది. డార్లింగ్ డేట్స్ కన్ఫర్మ్ కాక ముందే ఫైనల్ వెర్షన్ సిద్ధం చేయాలి.
ఈ రెండూ పూర్తి చేసేనాటికి 2026 దాటిపోవచ్చు. నెక్స్ట్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ టి సిరీస్ నిర్మాణంలో ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంది. ఒకవేళ సందీప్ వంగా కనక వీటి తర్వాత ఎవరైనా పెద్ద హీరోతో చేయాలనుకుంటే రెండే ఆప్షన్లు పెట్టుకున్నాడట. వాళ్ళు చిరంజీవి, పవన్ కళ్యాణ్. ముందు నుంచి వీరాభిమాని కావడంతో దాన్ని బయట పెట్టుకునే ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటాడు. సల్మాన్ లేదా షారుఖ్ నిజంగా పిలిచినా వాళ్ళు సందీప్ స్కూల్ కి అంత సులభంగా సెట్ కారు. రన్బీర్ కపూర్ తో వచ్చిన సింక్ బడా సీనియర్లతో కుదరటం కష్టం.
This post was last modified on February 3, 2024 8:46 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…