ఒకవైపు షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతోందన్న ఆనందం, ఇంకోవైపు ఆగస్ట్ 15 ఖచ్చితంగా విడుదల చేయగలమో లేదోననే ఆందోళన మధ్య పుష్ప టీమ్ ఒత్తిడికి లోనవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చకూడదని, ఎంత రిస్క్ అయినా రేయి పగలు పని చేద్దామని అల్లు అర్జున్ సిద్ధంగా ఉండగా, ప్రతి షాటు పర్ఫెక్ట్ గా వస్తే తప్ప సంతృప్తి చెందని సుకుమార్ రెట్టింపు బరువు పడుతున్నా సరే తట్టుకుని మరీ కొనసాగిస్తున్నాడు. జగదీశ్ బెయిల్ మీద బయటికి రావడంతో కానిస్టేబుళ్ల పహారాలో తన మీద తీయాల్సిన సీన్లను వాయు వేగంతో పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.
కీలకమైన జాతర ఎపిసోడ్ లో జగదీశ్ పాత్ర కీలకంగా ఉంటుందట. అలా అని హడావిడిగా తీయడానికి ఉండదు. అయినా సరే వీలైనంత క్వాలిటీగా వచ్చేలా సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అవసరమైతే తన సీన్లు కొన్ని తీసేయాలని కూడా డిసైడ్ అయ్యారట. సమస్య ఏంటంటే ఒక ముఖ్యమైన ట్విస్టు జగదీశ్ మీద ఉంటుంది. దాన్ని మారిస్తే మొత్తం ఫ్లో దెబ్బ తింటుంది. అందుకే అదలాగే ఉంచి దాని కన్నా ముందు వచ్చే సీన్లను ట్రిమ్ చేసే అవకాశం గురించి టీమ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఊహించని పరిణామాల వల్ల వచ్చిన ముప్పు.
చేతిలో ఉన్న ఆరు నెలలు పుష్ప 2 రన్నింగ్ రేస్ చేయాల్సిందే. ఏ మాత్రం వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలిసినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మూకుమ్మడిగా ఆగస్ట్ 15ని లాగేసుకునేందుకు వేరే నిర్మాతలు కాచుకుని ఉన్నారు. పైగా నెట్ ఫ్లిక్స్ తో జరిగిన ఓటిటి అగ్రిమెంట్ లో ఈ డేట్ కి అనుగుణంగానే స్టీమింగ్ కి ఎంత గ్యాప్ ఇవ్వాలనేది రాసుకున్నారని డిజిటల్ వర్గాల భోగట్టా. ఒకవేళ అది మార్చాల్సి వస్తే భారీగా ఆఫర్ చేసిన మొత్తంలో కొంత కోత పడొచ్చట. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా ఐకాన్ స్టార్ అభిమానులు మాత్రం ఇంతకన్నా వెయిటింగ్ మావల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు.
This post was last modified on February 1, 2024 10:44 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…