ప్రస్తుతం టాలీవుడ్లో అతి పెద్ద హీరో అంటే ప్రభాసే. దేశవ్యాప్తంగా అతడికి తిరుగులేని పాపులారిటీ ఉంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడతను. ఈ ఇమేజ్‌ను ఉపయోగించుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇప్పుడు ఓ మంచి పనికి ప్రభాస్ సాయం తీసుకుంది.
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు, ఈ దిశగా జనాల్లో అవగాహన పెంచేందుకు ఎంపీ సంతోష్ కుమార్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు కొంత కాలంగా. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రెటీలందరినీ భాగం చేసి జనాల్లో చైతన్యం తెచ్చాడు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. హైదరాబాద్ శివార్లలోని జిన్నారం మండలంలో ఓఅర్ఆర్ సమీపంలోని ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ చేయూత తీసుకుంది.
అక్కడ ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్పాడు. తన తండ్రి, దివంగత సూర్యనారాయణ రాజు పేరు మీద అర్బన్ పార్కు,అటవీ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ప్రభాస్ ముందుకొచ్చాడు. ఇందుకోసం ముందుగా 2 కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్.. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. ప్రభాస్ బాటలో మున్ముందు మరింతమంది టాలీవుడ్ స్టార్లు ప్రయాణించి అటవీ ప్రాంత అభివృద్ధికి చేయూత అందిస్తారని భావిస్తున్నారు.
This post was last modified on September 7, 2020 7:48 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…