దగ్గుబాటి రానా డెబ్యూ మూవీగా లీడర్ సినిమా అభిమానులకు చాలా స్పెషల్. సమకాలీన రాజకీయాలను దర్శకుడు శేఖర్ కమ్ముల స్పృశించిన తీరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. పొలిటికల్ కుళ్ళుని ప్రశ్నిస్తూనే సమాజంలో పాతుకుపోయిన మంత్రుల అవినీతిని చూపించిన తీరు శభాష్ అనిపించుకుంది. అప్పటిదాకా హ్యాపీ డేస్, గోదావరి, ఆనంద్ లాంటి సాఫ్ట్ ఎమోషన్స్ తో మాత్రమే మనకు గుర్తుండిపోయిన కమ్ములలోని మరో యాంగిల్ ని ఆవిష్కరించింది ఈ లీడరే. బ్లాక్ బస్టర్ కాకపోయినా లెక్కల పరంగా సేఫ్ అవ్వడమే కాక రానాకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఎప్పటి నుంచో లీడర్ సీక్వెల్ కావాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే శేఖర్ కమ్ముల కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ధనుష్ నాగార్జునలతో ప్రస్తుతం ముంబై బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్టారర్ తీస్తున్న ఈ విలక్షణ దర్శకుడు ఇదే ఏషియన్ బ్యానర్ కు మూడో కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్నే అఫీషియల్ గా ప్రకటించారు. అయితే క్యాస్టింగ్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది లీడర్ 2నేనట. రాష్ట్ర విభజన జరిగాక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చిన దృష్ట్యా వాటిని లీడర్ 2 లో చూపించబోతున్నట్టు తెలిసింది.
ప్రస్తుతానికి ఇంత కన్నా డీటెయిల్స్ లేవు. రానానే కొనసాగుతాడా లేక ఇంకో హీరో ఎంట్రీ ఇస్తాడానేది వేచి చూడాలి. రానా ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రి ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చేశాడు. రాక్షస రాజు కూడా ఈ నేపథ్యంలోనే ఉంటుంది. అలాంటప్పుడు లీడర్ 2కి ఎస్ చెబుతాడా లేదానేది వేచి చూడాలి. ఫ్యాన్స్ మాత్రం రానా అయితేనే కంటిన్యుటి ఉంటుందని భావిస్తున్నారు. ధనుష్ నాగ్ మూవీ పూర్తవ్వడానికి ఇంకో ఏడాది పడుతుంది. ఆ లోగా లీడర్ 2 స్క్రిప్ట్ ఒక కొలిక్కి వస్తుంది. శేఖర్ కమ్ములకు రానాతో పాటు మరో ఇద్దరు ఆప్షన్లలో ఉన్నారట. ఎవరెనేది ఇప్పట్లో బయటపడకపోవచ్చు