ఊహించిన దానికన్నా చాలా పెద్ద స్థాయిలో ప్రభంజనం సృష్టించిన హనుమాన్ ప్రస్తుతం మూడు వందల కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. టాలీవుడ్ అతి పెద్ద సంక్రాంతి విజేతగా అవతరించిన ఈ విజువల్ వండర్ ని 3Dలో మళ్ళీ విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన దర్శకుడు ప్రశాంత్ వర్మ బృందం చాలా సీరియస్ గా చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. కొంత భాగం శాంపిల్ ని హైదరాబాద్ లోని ఒక మల్టీప్లెక్స్ లో వేసుకుని చూసి సంతృప్తి చెందారని సమాచారం. ఫుల్ వెర్షన్ దిశగా వర్క్ జరుగుతోందని యూనిట్ టాక్.
వినడానికి బాగానే ఉంది కానీ హనుమాన్ ని మళ్ళీ త్రిడి సాంకేతికలో చూసేందుకు ప్రేక్షకులు ఎంత మేరకు ఆసక్తి చూపిస్తారనే ప్రశ్నకు సమాధానం కష్టం. గతంలో ఆర్ఆర్ఆర్ కు వచ్చిన స్పందన తక్కువే. రెగ్యులర్ వెర్షన్ ని చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అయితే హనుమాన్ కేసు వేరు. ఇంటర్వెల్ బ్లాక్, తేజ సజ్జ తిరగబడి విలన్లను ఎదిరించే ఎపిసోడ్, క్లైమాక్స్ ఘట్టం ఇవన్నీ ఖచ్చితంగా 3Dలో కొత్త అనుభూతినిస్తాయి. కాకపోతే ఇప్పుడున్న టికెట్ రేట్లకు మళ్ళీ ఇంకో పాతిక ముప్పై రూపాయలు ఎక్కువ పెట్టి థియేటర్లకు జనాలు వస్తారా అనేది సస్పెన్స్.
ఏదైనా వీలైనంత త్వరగా చేస్తే బెటర్. ఫిబ్రవరి తర్వాత పెద్ద సినిమాల తాకిడి పెరుగుతుంది. మార్చిలో ఓటిటిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదున్నా హనుమాన్ ఇప్పుడే ప్రణాళిక వేసుకోవాలి. దానికి తగ్గట్టే నిర్మాత పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారట. ఒకటి టికెట్ రేట్లను అయిదో వారం నుంచి తగ్గించడం. రెండోది ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్లను అదనంగా జోడించడం. వీటికి కనక 3D తోడైతే మరోసారి చూసే ఆడియన్స్ సంఖ్య పెద్దదే ఉండొచ్చు. రెస్పాన్స్ ని బట్టి పెరుగుదల ఉంటుంది. ప్రమోషన్లు మాత్రం హనుమాన్ టీమ్ ఆపడం లేదు. యుఎస్ కి ప్రత్యేకంగా మూడు రోజుల టూర్ వేస్తున్నారు.
This post was last modified on January 31, 2024 2:36 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…