గేమ్ ఛేంజర్ ఆలస్యం విషయంలో అన్ని వేళ్ళు దర్శకుడు శంకర్ వైపే వెళ్తున్నాయి. రామ్ చరణ్ వేరే ఏ సినిమా ఒప్పుకోకుండా మూడేళ్లు ఇదే ప్రాజెక్టు మీద ఉన్నా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం పట్ల అభిమానుల అసహనం పీక్స్ కు చేరుకుంటోంది. ఇండియన్ 2 వల్లే ఇదంతా అని తెలిసినా నిర్మాత దిల్ రాజుతో సహా ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం తాజా షెడ్యూల్ చిత్రీకరణలో టీమ్ బిజీగా ఉంది. అయితే శంకర్ మౌనంగా ఉండటం, అప్డేట్స్ విషయంలో కనీస దూకుడు చూపించకపోవడం పరిస్థితిని ఇంకా కిందకు తీసుకెళ్తున్న మాట వాస్తవం.
అసలాయన మనసులో ఏముందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఫలానా టైంకి పూర్తి చేస్తానని చెబితే ఏ గొడవ లేదు. మొన్నెప్పుడో దిల్ రాజు సెప్టెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పిన కొద్దిరోజులకే పవన్ ఓజి డేట్ లాక్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో గేమ్ ఛేంజర్ 2025కి వాయిదా పడొచ్చనే కొత్త వార్త షికారు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి చివరివారానికి తన భాగం పూర్తి చేయాలనే సంకల్పంతో రామ్ చరణ్ ఉన్నాడు. కానీ దానికి తగ్గట్టుగా షెడ్యూలింగ్ జరగడం లేదు. ఇంకో వైపు ఆర్సి 16 కోసం బుచ్చిబాబు సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ ఫైనల్ కావాలన్నా చరణ్ రావాలి.
రెండు ప్యాన్ ఇండియా సినిమాలు శంకర్ ఒకేసారి హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండటం సహజమే కానీ ఫ్యాన్స్ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడైనా సినిమా తాలూకు ప్రమోషన్ మెటీరియల్ ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటే వాళ్లకూ ఊరట కలుగుతుంది. బైక్ మీద ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి పబ్లిసిటీ జరగలేదు. జరగండి జరగండి లిరికల్ వీడియో గత దీపావళి నుంచి వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండింగ్ జరిగింది. తమన్ కూడా సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇన్ని సందిగ్దతల్లో కొన్నయినా తగ్గాలంటే శంకర్ సార్ సైలెన్స్ ని బ్రేక్ చేయాలి.
This post was last modified on January 31, 2024 11:44 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…