Movie News

రాంబాబు వస్తోంది కౌంటర్ ఇవ్వడానికే

ఫిబ్రవరి 8 విడుదల కాబోతున్న యాత్ర 2 కేవలం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని సినిమా ద్వారా హైలైట్ చేయడం కోసమేనని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ట్రైలర్ లో ఇచ్చిన ఎలివేషన్లకే మ్యాటర్ అర్థమైపోయింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా రెండు నెలల ముందు రిలీజ్ ప్లాన్ చేసింది కూడా ఈ కారణంగానే. దర్శకుడు మహి వి రాఘవ్ పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేస్తున్నారు కూడా. అయితే ప్రతిపక్ష పార్టీలు జనసేన టీడీపీ వద్ద ఇలాంటి ఆయుధం ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు. అందుకే దానికి ఫ్యాన్స్ పూనుకుని పాత సినిమాని రీ రిలీజ్ కి సిద్ధం చేయబోతున్నారు.

ఒక రోజు ముందు ఫిబ్రవరి 7న కెమెరామెన్ గంగతో రాంబాబుని పునఃవిడుదల చేయబోతున్నారని సమాచారం. రీ రిలీజుల ట్రెండ్ ప్రస్తుతానికి తగ్గినప్పటికీ ఎలక్షన్ల వేడిలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతారని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఓజి నిర్మిస్తున్న డివివి సంస్థనే రాంబాబు ప్రొడ్యూసర్ కావడం మరో సానుకూలాంశం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో తండ్రి కొడుకులుగా కోట శ్రీనివాసరావు – ప్రకాష్ రాజ్ పాత్రలను రాంబాబు క్యారెక్టర్ చెడుగుడు ఆడే విధానం ఓ రేంజ్ లో పేలింది. కొన్ని అభ్యంతరాల వల్ల ఒకటి రెండు సీన్లు తీసేయాల్సి వచ్చింది.

సో ఇలాంటి పొలిటికల్ హీట్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు రావడం మంచి నిర్ణయమే. అప్పట్లో ఇది బ్లాక్ బస్టర్ కాలేదు కానీ కమర్షియల్ గా మంచి విజయమే అందుకుని. ముఖ్యంగా పూరి జగన్నాథ్ మార్కు సెటైర్లు థియేటర్లలో బాగా పేలాయి. ఇప్పుడున్న పరిస్థితికి ఇంకా బాగా అద్దం పట్టేలా ఏపీ రాజకీయాలు మారిపోవడంతో హాళ్లలో జనాలు ఈలలు కేకలు వేయడం ఖాయమంటున్నారు. జర్నలిజం, రాజకీయాలు, విద్యార్థులు బాధ్యత, పౌరుల రక్షణ ఇలా ఎన్నో అంశాల మీద చర్చించిన రాంబాబు మరి ఈ రిలీజ్ లో ఏమైనా సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.

This post was last modified on January 30, 2024 10:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

44 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago