ప్రతినాయకుడిగా ఎన్ని పాత్రలు చేసినా ఛత్రపతిలో ప్రభాస్ ని రెచ్చగొట్టే కాట్రాజుగా నటించిన సుప్రీత్ ప్రేక్షకుల మనసులో అలాగే గుర్తుండిపోయాడు. స్టార్ హీరోల సినిమాల్లో చెప్పుకోదగ్గ వేషాలు వేసినప్పటికీ మళ్ళీ ఆ స్థాయి గుర్తింపు రాలేదు. గత కొంత కాలంగా కనిపించడం కూడా తగ్గించేశాడు. కారణమేంటయ్యా అంటే ఇతను దర్శకత్వం చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడానికట. దీని గురించి ఇండస్ట్రీ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన రాలేదు. అలాని సుప్రీత్ ఆషామాషీ డెబ్యూ చేయడం లేదని సమాచారం.
ఏకంగా న్యాచురల్ స్టార్ నానిని ఒప్పించినట్టు తెలుస్తోంది. డివివి లేదా యువి ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టుని తెరకెక్కించే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది కానీ దసరా, సరిపడా శనివారంలకు పూర్తి భిన్నంగా అనిపించే సరికొత్త ట్రీట్ మెంట్ తో కథ రాసుకున్నాడట. నాని లిస్టులో సుప్రీత్ కన్నా ముందు బలగం వేణు ఉన్నాడు. ఎల్లమ్మ వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. నిర్మాత దిల్ రాజు, నానిలకు ఫైనల్ వెర్షన్ నచ్చితే ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనేది నిర్ణయిస్తారు. కానీ సుప్రీత్ దీనికన్నా అడ్వాన్స్ గా ఉన్నాడట.
ఇది నిజమైతే మాత్రం సుప్రీత్ ది పెద్ద అదృష్టం అనుకోవాలి. నాని లాంటి మార్కెట్ ఉన్న హీరో డెబ్యూకి దొరకడం అంటే మాటలు కాదు. అయితే న్యాచురల్ స్టార్ డెసిషన్ ఎవరి వైపు ఉంటుందనేది వేచి చూడాలి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కూడా లైన్ లో ఉన్నాడు. ఆ మధ్య స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నానని చెప్పాడు. సరిపోదా శనివారం వేసవిలోగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆలోగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేది నాని ఆలోచన. వరస క్రమం కొంచెం అటుఇటు అయినా ఇవన్నీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినవేనని వినిపిస్తోంది. చూడాలి మరి ముందువరసలో ఎవరుంటారో.
This post was last modified on January 30, 2024 11:05 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…