ఇంకా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తేలలేదు. ఇంకో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుందో క్లారిటీ రాలేదు. అలాంటిది రామ్ చరణ్ చేయబోయే 17వ సినిమా గురించి డిస్కషన్ రావడం అంటే విచిత్రమే. అది కూడా సుకుమార్ దర్శకత్వంలో. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ ని రిపీట్ చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ పుష్ప వల్ల ఏళ్లకేళ్లు కరిగిపోవడంతో సాధ్యపడలేదు. సుకుమార్ దగ్గర చరణ్ కోసం ఒక కథ ఉన్న మాట వాస్తవమే కానీ అదింకా పూర్తి స్క్రిప్ట్ రూపంలోకి మారలేదు. చాలా టైం అయితే పడుతుంది.
ముందు రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ విడుదలవ్వాలి. సెప్టెంబర్ అంటున్నారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వగైరాలకు కనీసం ఏడాదిన్నర కావాలని ముందే మాట్లాడుకున్నారట. అంటే 2026లో తప్ప ముందే వచ్చే ఛాన్స్ లేదు. ఈలోగా పుష్ప 2 నుంచి సుకుమార్ పూర్తిగా ఫ్రీ అయ్యి ఉంటారు. అప్పటికంతా ఫైనల్ వెర్షన్ సిద్ధం చేస్తే మంచిదే. ఇంకో ట్విస్టు ఏంటంటే పుష్ప 3 ఆలోచన కూడా సీరియస్ గా జరుగుతోందట. ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు కానీ బన్నీ ఆసక్తిగానే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు.
సో ఆర్సి 17 గురించి ఇప్పుడప్పుడే చర్చ వర్కౌట్ కాదు. సుకుమార్ నిజంగా చరణ్ తోనే చేస్తాడా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియాలి. పుష్ప 1 రిలీజైన కొత్తలో విజయ్ దేవరకొండతో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్టుని కొత్త నిర్మాతతో అనౌన్స్ చేశారు కానీ తర్వాత దాన్ని డ్రాప్ చేశారు. తిరిగి పట్టాలు ఎక్కించే ప్రయత్నం జరుగుతోందన్నారు కానీ ఆ సూచనలైతే లేవు. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఇంటర్నేషనల్ ఇమేజ్ వల్ల చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయలేకపోతున్న పరిస్థితి వచ్చింది. ఆచి తూచి అడుగులు వేయడం వల్ల ఫ్యాన్స్ కి విపరీతమైన ఎదురుచూపులు తప్పవు.
This post was last modified on January 28, 2024 4:27 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…