ఏజెంట్ వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పటిదాకా అఖిల్ కొత్త సినిమా మొదలుకాలేదు. కనీసం ప్రకటన లేదు. అప్పుడప్ప్పుడు బయట కనిపించడం తప్ప మీడియాతో మాట్లాడుతున్న దాఖలాలు కూడా లేవు. ఇటీవలే అఖిల్ బెంగళూరులో జరిగిన సలార్ పార్టీలో చేతికి గాయంతో ప్రత్యక్షమైన అందరినీ ఆశ్చర్యపరచడం తప్ప ఎలాంటి అప్ డేట్ లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆల్రెడీ ప్యాన్ ఇండియా మూవీ లాకైన సంగతి తెలిసిందే. ధీరా అనే టైటిల్ అనుకున్నారట. కానీ ఎదురు చూసే కొద్దీ లేట్ అవుతూనే ఉంది.
దీనికి కారణమేంటయ్యా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. మొదటిది బడ్జెట్. అఖిల్ కు పెద్ద మార్కెట్ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో వంద కోట్ల దాకా రెడీ అయ్యారట. అయితే సబ్జెక్టు ఇంకా ఎక్కుడ డిమాండ్ చేస్తుండటంతో భాగస్వామిగా హోంబాలే ఫిలిమ్స్ ని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆల్మోస్ట్ ఒప్పందం కుదిరిందని, అఖిల్ ప్రభాస్ ఈవెంట్ కి హాజరు వెనుక అసలు గుట్టు ఇదేనని తెలిసింది. ఇది గేమ్స్ అఫ్ థ్రోన్స్ తరహాలో జానపదం, ఫాంటసీ అన్నీ మిక్స్ చేసి విజువల్ ట్రీట్ గా రూపొందిస్తారని టాక్. ఇదే యూవీ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తోంది.
రెండు కథలు వేరు అయినప్పటికీ స్కేల్, బడ్జెట్ పరంగా సారూప్యతలు ఉండటంతో అఖిల్ స్క్రిప్ట్ ని మరింత పక్కాగా తీర్చిదిద్దే ఉద్దేశంతో లేట్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన పాత్రలకు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు అవసరం ఉండటంతో ఆ దిశగా పలువురితో డిస్కషన్స్ చేస్తున్నట్టు వినికిడి. సో అఖిల్ 6 ఎప్పుడు మొదలైనా 2025 సమ్మర్ లో లేదా ఏడాది చివర్లో వస్తుంది. అంతకన్నా ముందు ఛాన్స్ లేనట్టే. కాకపోతే అఖిల్ మరీ ఓవర్ గ్యాప్ తీసుకుంటున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. డిజాస్టర్స్ వచ్చినంత మాత్రాన ఇంత వెయిటింగ్ గేమ్ ఆడకూడదని కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 28, 2024 2:27 pm
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోవడంతో మెగాభిమానుల దృష్టి ఆర్సి 16 వైపుకు వెళ్తోంది. తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు…
పరిటాల…ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు రాజకీయంగా అయినా… ఇటు ఆయా ప్రాంతాలపై పట్టు…
వారసత్వ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని,…
ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు,…
గత డిసెంబర్ లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ ఓటిటి రిలీజ్…
కల్ట్ ఫిలిం మేకర్స్ గా బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ లో వెట్రిమారన్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా…