Movie News

వర్మను ఫ్రస్టేట్ చేస్తున్నాడంటే మొనగాడే..

రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కెలకడం అలవాటు. అవతలి వాళ్లను ఇరుకున పెట్టేలా మాట్లాడి వాళ్లు రెచ్చిపోతుంటే కూల్‌గా ఆ తంతును ఆస్వాదించడం వర్మకు మహదానందం కలిగిస్తుంది. అవతలి వాళ్లు బూతులు తిడుతుంటే వర్మ మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా కూల్‌గా కౌంటర్లు వేస్తూ ఆస్వాదిస్తుంటాడు.

అలాంటి వర్మ ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. పట్టరాని కోపం తెచ్చుకుని ఊగిపోతున్నాడు. అవతలి వ్యక్తిని ఎవరైనా దెబ్బ కొడితే చూడాలని తహతహలాడిపోతున్నాడు. ఆ దిశగా కొందరిని ఉసిగొల్పే ప్రయత్నం అవిశ్రాంతంగా చేస్తున్నాడు.

కానీ వర్మ టార్గెట్ చేస్తున్న వ్యక్తి కానీ.. అతడి మీదికి వర్మ ఉసిగొల్పాలని చూస్తున్న వ్యక్తులు కానీ వర్మను అస్సలు పట్టించుకోవడం లేదు పాపం. అంతగా తన విలువను దిగజార్చుకున్నాడు ఒకప్పటి మన లెజెండరీ డైరెక్టర్.

ఇంతకీ విషయం ఏంటంటే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించి మీడియాలో విస్తృతమైన కవరేజీ, చర్చా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నాడు రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి. బాలీవుడ్ మూవీ మాఫియా మీద అతను యుద్ధం ప్రకటించి.. సుశాంత్ మృతికి వాళ్లే కారణం అని అతను తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు.

టీవీ చర్చల్లో తీవ్ర ఆగ్రహాకావేశాలతో బాలీవుడ్ వాళ్లను టార్గెట్ చేస్తున్నాడు. అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సర్కారును, ముంబయి పోలీసులను అతను సవాలు చేస్తున్నాడు. సుశాంత్ మృతికి అతడి మాజీ ప్రేయసి రియానే కారణమని.. ఆమెను లోకల్ పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అతను ఆరోపణలు చేస్తున్నాడు.

ఈ వ్యవహారం వర్మకు అస్సలు నచ్చట్లేదు. తనకు నచ్చని వ్యక్తుల మీద ఈజీగా సినిమాలు అనౌన్స్ చేసేయడం వర్మకు అలవాటు. అర్నాబ్ మీద కూడా అలాగే సినిమా ప్రకటించాడు. కొన్ని రోజులుగా అర్నాబ్‌ను ట్విట్టర్ ద్వారా దునుమాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. తాజాగా శివసేన సర్కారును, ముంబయి పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మీకు దమ్ము లేదా అన్నట్లుగా మాట్లాడాడు. అయినా సరే.. అటు నుంచి స్పందన లేదు. ఇక అర్నాబ్ సంగతి సరేసరి. వర్మ ఉనికినే గుర్తించట్లేదు. కానీ మన వర్మ మాత్రం తన పోరాటాన్ని ఆపట్లేదు. అసహనాన్ని దాచుకోవట్లేదు. ఎప్పుడూ అవతలి వాళ్లను గిల్లి వినోదం చూసే వర్మను ఇలా ఫ్రస్టేట్ చేస్తున్నాడంటే అర్నాబ్ మొనగాడే కదా.

This post was last modified on September 6, 2020 5:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: AranabRGV

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

4 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

5 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

6 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

7 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

8 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

9 hours ago