కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు యువ కథానాయకుడు నితిన్. అతడి చివరి సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కు కూడా అదే ఫలితం వచ్చింది. దీంతో నితిన్ ఆశలన్నీ తన కొత్త చిత్రం రాబిన్ హుడ్ మీదే ఉన్నాయి. నితిన్ కు చివరిగా భీష్మతో హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్, కాన్సెప్ట్ టీజర్ మంచి హ్యూమర్ తో సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే టీజర్లో కానీ, దీని గురించి ఇచ్చిన ప్రెస్ నోట్లో కానీ ఎక్కడా హీరోయిన్ ప్రస్తావన లేదు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు రష్మిక మందన్నాను కథానాయకగా ఎంచుకున్నారు. భీష్మ కాంబినేషన్ రిపీట్ అంటూ ఒక మంచి టీజర్ కూడా కట్ చేశారు. కానీ డేట్లు సర్దుబాటులో కాకో మరో కారణంతోనో రష్మిక ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఇది జరిగి కూడా కొన్ని నెలలు గడిచింది. కొంత షూటింగ్ కూడా జరిగింది. కానీ హీరోయిన్ సంగతే తేలలేదు.
రష్మిక స్థానంలో ఎవరినైనా ఎంపిక చేశారా ఇంకా శోధన జరుగుతోందా అన్నది క్లారిటీ లేదు. హీరోయిన్ ఎవరో తెలియకుండా ఒక క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ మధ్యలో ఉండటం అరుదైన విషయం. సాధ్యమైనంత త్వరగా హీరోయిన్ని ఖరారు చేసి, అనౌన్స్ చేయాలని నితిన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on January 26, 2024 7:44 pm
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…