టిల్లు స్క్వేర్ మార్చి 29 విడుదలను ప్రకటించడం, ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 దాదాపు లాకైపోవడం దేవర చుట్టూ ఉన్న సస్పెన్స్ ని పూర్తిగా తీసేశాయి. అభిమానులు, ప్రేక్షకులు అనుమానపడినట్టే వాయిదా పడిన సంగతి ఖరారైపోయింది. ఇక అందరి చూపు తర్వాత ఏ డేట్ కి వస్తుందనే దాని మీద వెళ్తోంది. ముందు చేతిలో ఉన్న ఆప్షన్లు ఏంటో చూద్దాం. ఈ వేసవికి సాధ్యపడదు. సమ్మర్ జూలై దాకా ఉన్నా అప్పటికంతా సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయనే గ్యారెంటీ లేదు. సైఫ్ పూర్తిగా కోలుకోవాలి. దానికన్నా ముందు అనిరుద్ రవిచందర్ తన పనిని వేగంగా పూర్తి చేసేలా రంగంలోకి దిగాలి.
ఆగస్ట్ లో పుష్ప 2 ది రూల్ ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని ఎప్పుడో అనౌన్స్ చేసింది. ఇదే మాట మీద ఉండటం డౌటేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ఈ స్లాట్ ని తీసుకోవడం మంచిదే. సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ తేవాలని నిర్మాత దిల్ రాజు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సాధ్యపడకపోతే అక్టోబర్ గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా సెలవుల దాకా లాంగ్ సీజన్ వైపు కన్నేస్తున్నారు. దర్శకుడు శంకర్ చెబితే తప్ప ప్రకటన ఇవ్వడానికి లేదు. నవంబర్ ప్యాన్ ఇండియా సినిమాలకు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి దేవర దాన్ని లైట్ తీసుకోవాలి.
ఇక మిగిలింది డిసెంబర్. సలార్ లాగే ది రాజా డీలక్స్ ని క్రిస్మస్ కానుకగా తేవాలని ప్రభాస్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 2025 సంక్రాంతికి విశ్వంభర లాంటి భారీ చిత్రాలు లాక్ చేసుకున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచన చేయడం లేదు. ఇక్కడ చెప్పుకునే మూడు స్లాట్స్ లో దేవరకు అనుకూలంగా ఏది ఉంటుందనేది దర్శకుడు కొరటాల శివ ఫస్ట్ కాపీని ఎప్పుడు సిద్ధం చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఏప్రిల్ 5 రావాలని దేవర శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తప్పుకుంది. ఇప్పుడిది పెద్ద సవాల్ నే తారక్ టీమ్ ముందు పెట్టింది.
This post was last modified on January 26, 2024 12:10 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…