తాజాగా విడుదలైన ఫైటర్ లో ఇష్క్ జైసా కుచ్ పాట లేకపోవడం మాస్ ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. సెన్సార్ సమయంలోనే దీన్ని తీసేయమని సూచించడంతో ఆ మేరకు దర్శక నిర్మాతలు ఆ సాంగ్ లేకుండానే రిలీజ్ చేశారు. నిజానికీ పాటలో హీరోయిన్ దీపికా పదుకునే విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. దీపిక పోషించిన పాత్ర ఎయిర్ ఫోర్స్ లో గౌరవనీయమైన గొప్ప పదవిలో ఉంటూ ఇలా అసభ్యంగా నృత్యాలు చేస్తున్నట్టు చూపించడం ఎంత మాత్రం సబబు కాదని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్ గా తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది.
యూట్యూబ్ లో మాత్రం నిక్షేపంగా చూసుకోవచ్చు. ఇప్పటికే 53 మిలియన్ల వ్యూస్ తో ఎంత ట్రెండింగ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి సినిమా చూశాక లేకపోవడమే సబబు అనిపించింది. ఎందుకంటే ఫైటర్ మొదటి నుంచి చివరి దాకా చాలా సీరియస్ గా సాగే యాక్షన్ డ్రామా. మైనస్సులు ఎన్ని ఉన్నప్పటికీ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దేశభక్తిని, ఎయిర్ ఫోర్స్ పోరాటాలను చూపించిన తీరు ప్రశంసలు అందుకుంది. రివ్యూలు, టాక్స్ మిక్స్డ్ గానే ఉన్నాయి కానీ గత ఏడాది ఇదే టైంలో పఠాన్ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దార్థ ఆనంద్ కి ఫలితం రిపీట్ కాకపోవచ్చు.
అయినా ఏదో స్కిన్ షోతో హైప్ తెద్దామని అవసరం లేకపోయినా ఇలా అంగాంగ ప్రదర్శన చేసే పాటను ఉంచడం సిద్దార్థ్ ఆనంద్ కి మొదటిసారి కాదు. పఠాన్ టైంలోనూ ఇదే దీపికా పదుకునే దుస్తుల మీద వివాదం చెలరేగింది. అయితే షారుఖ్ ఖాన్ చొరవతో హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తప్పించుకోలేకపోయాడు.
This post was last modified on January 26, 2024 10:14 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…