రెండు వారాలకే రెండు వందల పదమూడు కోట్ల గ్రాస్ వచ్చిందని అధికారికంగా చెప్పుకున్న గుంటూరు కారం హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. ప్రకటనలు పెద్దగా రావడం లేదు. ట్విట్టర్ హ్యాండిల్ లో థియేటర్ ఫోటోలతో మేనేజ్ చేస్తున్నారు కానీ వసూళ్లు బాగా నెమ్మదించి ఫైనల్ రన్ కు దగ్గరగా వెళ్తోందన్న మాట వాస్తవం. ఇప్పుడు చివరి ఓవర్ ఆడే టైం వచ్చేసింది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం మూడు రోజుల వీకెండ్ లో రెండు జాతీయ సెలవులు వస్తున్నాయి. ఏదైనా పికప్ లాంటిది జరగాలన్నా, కలెక్షన్ల పరంగా అద్భుతాలు చూడాలన్నా ఇప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంది.
ఫిబ్రవరి నుంచి అవకాశం ఉండదు. నిర్మాత బ్రేక్ ఈవెన్ గురించి చెబుతూ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారని ఆ మధ్య ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా లాభాలు వచ్చాయా నష్టాలు మిగిలాయా అనేది తేలాలంటే మాత్రం ఇంకో వారం రోజులు ఆగాలి. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ ఉంటుందన్న వార్తలు గట్టిగానే తిరుగుతున్నాయి. సలార్ కు కేవలం 28 రోజుల గ్యాప్ ని మైంటైన్ చేసిన ఈ ఓటిటి గుంటూరు కారంకి కూడా అదే ఒప్పందం చేసుకుందని ఇన్ సైడ్ టాక్. స్ట్రీమింగ్ కి ముందు రోజు వరకు అఫీషియల్ గా చెప్పరు కాబట్టి ఎదురు చూడాల్సిందే.
ట్రేడ్ టాక్ ప్రకారం నూటా ముప్పై రెండు కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన గుంటూరు కారం ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే ఈపాటికి లాభాల్లో అడుగు పెట్టేది. కానీ తగ్గిపోయిన షోలు పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అనూహ్యంగా ఏదైనా పెరుగుదల ఉండటం డౌటే. పైగా సక్సెస్ మీట్ చేయలేదు. ఓ ఇంటర్వ్యూ ఇచ్చేసి మహేష్ జర్మనీ వెళ్ళిపోయాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరిలతో ప్రమోషన్లు రన్ చేయడం కష్టం. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్, తమన్ కు అసలు కెమెరా ముందుకే రాలేదు. మరి చివరి ఓవర్లో గుంటూరు కారం ఏమైనా సిక్సర్లు కొడుతుందేమో చూడాలి.
This post was last modified on January 25, 2024 3:16 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…