సంక్రాంతి నుంచి తప్పుకున్నందుకు గాను తమకు సోలో రిలీజ్ ఇవ్వాలని ఈగల్ నిర్మాతలు చేస్తున్న డిమాండ్ కథ క్లైమాక్స్ కు చేరేలా ఉందని ఫిలిం నగర్ టాక్. యాత్ర 2 వాయిదా సాధ్యం కాదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన సినిమా కాబట్టి మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తే మూడు నాలుగు నెలలు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మినహాయింపు ఇమ్మని కోరారట. పోటీ పరంగా అదేమీ ఇబ్బంది పెట్టేది కాకపోవడంతో ఈగల్ బృందానికి సమస్య లేదు. ఇక లాల్ సలామ్ గురించి భయపడాల్సింది లేదు. రజనీకాంత్ క్యామియో మినహాయిస్తే తెలుగు ఆడియన్స్ కి ఎలాంటి భయం లేదు.
ఎటొచ్చి ఊరు పేరు భైరవకోనతో చిక్కొచ్చి పడింది. ఇవాళ ఛాంబర్ మీటింగ్ లో దీని గురించే ప్రధానంగా చర్చించబోతున్నారని టాక్. మొన్న హనుమాన్ ని ఇలాగే తక్కువంచన వేయడం వల్ల గుంటూరు కారం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చూశాం. చాలా చోట్ల రెవిన్యూలు తీవ్రంగా ప్రభావితం చెందాయి. భైరవకోనకు ట్రైలర్ వచ్చాక బజ్ పెరిగింది. పాటలు బాగా వెళ్తున్నాయి. దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వం మీద మూవీ లవర్స్ కి నమ్మకముంది. ఈ నేపథ్యంలో విరూపాక్ష లాగా సంచలనం సృష్టించే అవకాశాలు కొట్టిపారేయలేం. ఈగల్ కు అదే టెన్షన్.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఎప్పుడో తేదీని లాక్ చేసుకున్న ఊరి పేరు భైరవకోనని పోస్టు పోన్ చేయమని కోరటం న్యాయం కాదని నిర్మాతలు భావిస్తున్నారట. పైగా దగ్గరలో ఏ డేట్ ఖాళీ లేదు. పోనీ దేవర డ్రాప్ అయితే ఏప్రిల్ 5 తీసుకుందామా అంటే దాని మీద ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ కన్నేశాయి. ఈ నేపథ్యంలో చర్చలు వాడివేడిగా ఉండే అవకాశం లేకపోలేదు. తమను సంప్రదించుకుండానే ఈగల్ కి హామీ ఇచ్చారని హీరో సందీప్ కిషన్ స్వయంగా చెప్పడం కొత్త ట్విస్టుని జోడించింది. చివరికి ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో సస్పెన్స్ గానే ఉంది.
This post was last modified on January 25, 2024 2:10 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…