ఒక్క పెద్ద ప్యాన్ ఇండియా సినిమా పూర్తి చేయడానికే స్టార్ హీరోలకు ఏళ్లకేళ్లు పడుతున్న ట్రెండ్ లో బాలీవుడ్ మొత్తానికి రన్బీర్ కపూరే అత్యంత అదృష్టవంతుడని ఎందుకు చెప్పాలో పూర్తి మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. యానిమల్ తో తొమ్మిది వందల కోట్ల బ్లాక్ బస్టర్ ని జేబులో వేసుకున్న రన్బీర్ కి సూపర్ స్టార్ ట్యాగ్ పెట్టారు కానీ నిజంగా దాన్ని సార్ధకం చేసుకునే పనిలో పడ్డాడు. అదెలాగో ప్రాజెక్టు లైనప్ చూసి చెప్పొచ్చు. ముందుగా తను చేయబోయే వాటిలో ‘యానిమల్ పార్క్’ మొదటిది. దాంట్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా చేయబోతున్నాడు. ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
దర్శకుడు నితీష్ తివారి వందల కోట్లతో ప్లాన్ చేసుకున్న ‘రామాయణం’లో రాముడిగా రన్బీర్ కపూరే లాకైన సంగతి తెలిసిందే. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. శతాబ్దాల తరబడి చెప్పుకునేలా తీస్తానని నితీష్ తెగ ఊరిస్తున్నారు. ఇవాళ సంజయ్ లీలా భన్సాలీ కొత్త సినిమా ‘లవ్ అండ్ వార్’ ప్రకటించారు. 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా ‘బ్రహ్మస్త్ర పార్ట్ 2 దేవా’తో పాటు ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 3’ని 2028 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం అయిదు క్రేజీ సినిమాలతో ఇంత భారీ లైనప్ షారుఖ్, సల్మాన్ లు కూడా లేదు.
ఖాన్ల ద్వయం క్రమంగా ముగింపుకోస్తున్న తరుణంలో కొత్త జనరేషన్ కు మొదటి స్టార్ హీరోగా రన్బీర్ కపూర్ నిలుస్తాడని విశ్లేషకులు అంచనాల వేస్తున్నారు. పైన చెప్పిన అయిదు సినిమాల మార్కెట్ విలువ ఎంత లేదన్నా మూడు వేల కోట్ల దాకా ఉంటుంది. థియేటర్ రైట్స్, ఓటిటి, డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ అంతా కలిపి అంతకన్నా ఎక్కువే అయినా ఆశ్చర్యం లేదు. మనకు ప్రభాస్ ఎలాగో నార్త్ జనాలకు రన్బీర్ కపూర్ అవతరిస్తున్నాడు. ఇతర హీరోలు ఈర్ష్య పడేందుకు ఇంతకన్నా కారణం ఏముంటుంది. అన్నట్టు లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర 2-3లో భార్య అలియా భట్టే హీరోయిన్ కావడం కొసమెరుపు.
This post was last modified on January 24, 2024 7:11 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…