Movie News

కామెడీ సినిమాకు సీరియస్ సీక్వెల్

బాలీవుడ్ కామెడీ క్లాసిక్స్ లో ఒకటిగా పేరున్న బడేమియా చోటేమియా 1998లో విడుదలై సంచలన విజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, గోవిందాల కాంబినేషన్లో దర్శకుడు డేవిడ్ ధావన్ పూయించిన నవ్వులు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో హీరోయిన్లుగా రమ్యకృష్ణ, రవీనాటాండన్ నటించారు. ఇన్నేళ్ల తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ తిరిగి అదే టైటిల్ ని వాడుకుని ఇంకో సినిమా తీశారు. కాకపోతే దర్శకుడు మారిపోయి ఈసారి పూర్తిగా సీరియస్ డ్రామాని తీసుకున్నారు. ఆ జంటే అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్. ఇవాళ టీజర్ వచ్చింది.

సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో కొత్త బడేమియా చోటే మియా రూపొందింది. ఇందులో అక్షయ్, టైగర్ ఇద్దరు సైనికుల పాత్రల్లో కనిపిస్తున్నారు. భారతదేశాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఒక తీవ్రవాది దానికి తగ్గట్టుగానే ఆధునిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి కుట్రలు పన్నుతాడు. ఇతన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతారు సోల్జర్స్ గా దేశసేవ చేస్తున్న బడేమియా చోటేమియా. బరిలో దిగితే విధ్వంసం తప్ప మరొకటి తెలియని ఈ జంట శత్రుమూకల ఆట ఎలా కట్టించిందనే పాయింట్ మీద రూపొందింది.

ఇది కొనసాగింపు కానప్పటికీ బడేమియా చోటేమియా టైటిల్ తో ఉన్న కనెక్షన్ వల్ల ఆడియన్స్ దీని మీద ప్రత్యేక అంచనాలు పెంచుకున్నారు. గత కొంతకాలంగా హిట్ల కన్నా డిజాస్టర్లు ఎక్కువ ఇస్తున్న అక్షయ్ కుమార్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. వరస రీమేకులతో ఫ్యాన్స్ కి సైతం విసుగొచ్చేలా చేసిన ఈ సీనియర్ హీరోకు పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకోవడం మంచిదే. సోనాక్షి సిన్హా, మానుషీ చిల్లర్ హీరోలకు జోడిగా కనిపించనుండగా రంజాన్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. ఈసారి సల్మాన్ ఖాన్ లేకపోవడంతో ఆ స్లాట్ ని మియాలు వాడేసుకుంటున్నారు.

This post was last modified on January 24, 2024 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

19 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago