ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకుడు శంకర్ దేవర గురించి వస్తున్న వార్తలు చూసి గేమ్ ప్లాన్ మారుస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఏప్రిల్ 5 విడుదల కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సమయం సరిపోదనే ఉద్దేశంతో వాయిదా తప్పదనే దిశగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి పాలై చిన్న సర్జరీతో ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవడం సమస్యని మరింత జటిలం చేసింది. ఎప్పటి నుంచి జాయిన్ అవుతాడనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. సైఫ్ స్వయంగా చెబితే తప్ప దేవర టీమ్ సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
దీన్ని శంకర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ దేవర కనక నిజంగా తప్పుకునే పనైతే భారతీయుడు 2ని అదే డేట్ కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే దిశగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముందు అనుకున్న డేట్ అయితే ఏప్రిల్ 12. కానీ ఇప్పుడు పెద్ద వీకెండ్ ఖాళీ అవుతోంది కాబట్టి ఆ స్థానాన్ని తాము తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో లైకా సంస్థ ప్రతినిధులతో సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారు. ఇది తేలాలంటే ముందు దేవర అనౌన్స్ మెంట్ రావాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి పుకార్లు వచ్చినా స్పందించే ఉద్దేశం కొరటాల బృందంలో లేదు.
ఎందుకైనా మంచిదని భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చూస్తున్న నిర్మాత దిల్ రాజుకి సహకరించాలంటే ముందు కమల్ హాసన్ సినిమాకు మోక్షం కలిగించాలి. పైగా శంకర్ చేతిలో ఇండియన్ 3 ఉంది. అది కూడా ఈ సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసే సంకల్పంతో ఉన్నారు శంకర్. నిజంగా దేవర డ్రాప్ అయినా దాని మీద ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ ఇప్పటికే కన్నేశాయి. చూస్తుంటే పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది.
This post was last modified on January 24, 2024 6:41 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…