Movie News

మెగా రామాయణానికి అన్నీ రెడీ

హిందూ పురాణ పురుషుల పాత్రలను సరిగ్గా వాడుకుంటే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో హనుమాన్ సినిమా రుజువు చేసింది. ఇందులో హనుమంతుడి పాత్రను అద్భుతంగా చూపించిన ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఐతే పురాణ పురుషుల పాత్రలను ఎలా చూపించకూడదో చెప్పడానికి గత ఏడాది ‘ఆదిపురుష్’ సినిమా నిదర్శనం. మన హీరో అని మొహమాటపడకుండా మాట్లాడుకుంటే రాముడి పాత్రలో ప్రభాస్‌ను కూడా అందులో సరిగా చూపించలేదు.

ఇక రావణుడి పాత్రలో సైఫ్‌ను చూపించిన విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మిస్ కాస్టింగ్, చెత్త విజువలైజేషన్‌తో రామాయణాన్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టాడు ఓం రౌత్. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో మరో రామాయణానికి రంగం సిద్ధమైంది. ఆదిపురుష్ లాగా కాకుండా ఈ సినిమా బెటర్‌‌గా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

దంగల్ దర్శకుడు నితీశ్ తివారి రూపొందించనున్న ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కాస్టింగ్‌ను ధ్రువీకరిస్తూ ట్వీట్ వేశాడంటే.. ఈ ముగ్గురే ముఖ్య పాత్రలను పోషిస్తున్నాడని ఖరారైంది. ఈ రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

ఈ మెగా ప్రాజెక్టులో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కూడా భాగం కానున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు కూాడా ఆయన ఈ ప్రాజెక్టులో ఉన్నాడో లేదో చూడాలి. సరైన కాస్టింగ్ ఎంచుకోవడంతోనే నితీశ్ తివారి సగం సక్సెస్ అయిపోయాడు. ఇక ఆదిపురుష్ తరహా పిచ్చి విజువలైజేషన్ లేకుండా.. సహజంగా ఈ కథను తెరకెక్కిస్తే అద్భుతమైన ఫలితాన్ని అందుకోవడానికి అవకాశముంటుంది.

This post was last modified on January 23, 2024 8:56 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago