బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లే అయ్యాయి. ఆ తర్వాత అతడికి ఉపశమనాన్ని ఇచ్చిన చిత్రం సలార్. ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. నిజానికి సలార్ సెప్టెంబర్ నెలాఖరులోనే రావాల్సినప్పటికీ.. అనివార్య కారణాలతో క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అయింది.
డంకీ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులకు క్రిస్మస్.. హిట్ సెంటిమెంట్ గా మారింది. దీంతో ప్రభాస్ మరో చిత్రాన్ని క్రిస్మస్ కి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రమే.. రాజాసాబ్.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీ మొత్తం పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ ను 2024 క్రిస్మస్ సీజన్లో విడుదల చేసే యోచన చేస్తోందట చిత్ర బృందం.
ముందు దసరాకు అనుకున్నప్పటికీ.. అప్పటికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయి ఉండడంతో క్రిస్మస్ సీజన్ పై దృష్టిసారించినట్లు సమాచారం. సెంటిమెంట్ గా కూడా ఇది కలిసొస్తుందని చూస్తున్నారట. డిసెంబర్ 20 డేట్ కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.
This post was last modified on January 23, 2024 6:35 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…