తెలుగులో చేసింది మూడు సినిమాలే కానీ.. మన దగ్గర సమీరా రెడ్డి పాపులారిటీ తక్కువేమీ కాదు. స్వతహాగా తెలుగమ్మాయే అయినప్పటికీ ఎక్కువగా నార్త్‌లో పెరగడం, బాలీవుడ్లోనే తొలి అవకాశాలు అందుకోవడంతో ఆమెకు బాలీవుడ్ హీరోయిన్‌గానే ముద్ర పడింది.
అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి అశోక్, జై చిరంజీవ, నరసింహుడు లాంటి భారీ చిత్రాల్లో నటించిందామె. ఆఫ్ ద సినిమా కూడా ఆమె నిరంతరం వార్తల్లో నిలిచేది ఒకప్పుడు. సినిమాలకు టాటా చెప్పేశాక పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిన సమీరా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను నటించిన బాలీవుడ్ మూవీ చిత్రీకరణ సందర్బంగా చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుంది. లిప్ లాక్ చేయనందుకు తనను ఓ దర్శకుడు ఎలా బెదిరించాడో ఇందులో ఆమె వివరించింది.
ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా హీరోతో లిప్ లాక్ సీన్ చేయాలని దర్శకుడు తనకు చెప్పాడని.. కానీ ముందు తనకు కథ, తన పాత్ర వివరించినపుడు ఈ లిప్ లాక్ గురించి చెప్పలేదని.. ఇదే విషయమై అభ్యంతరపెడితే ఆ దర్శకుడు అడ్డం తిరిగాడు సమీరా వెల్లడించింది. ఆ సీన్ చేయకపోతే సినిమా నుంచి తప్పించాల్సి ఉంటుందని అతను బెదిరించినట్లు తెలిపింది.
అంతే కాక దాని కంటే ముందు చేసిన ‘ముసాఫిర్’ సినిమాలో లిప్ లాక్ ఉన్న విషయాన్ని ఆ దర్శకుడు గుర్తు చేశాడని.. అందులో చేసినపుడు మళ్లీ చేయడానికి అభ్యంతరమేంటి అని తేలిగ్గా మాట్లాడాడని.. ఈ విషయమై గొడవ జరిగిందని.. కానీ ఆ దర్శకుడు బెదిరించడంతో అయిష్టంగానే ఆ లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందని సమీరా చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడెవరు, సినిమా ఏది అనే విషయాలు మాత్రం సమీరా వెల్లడించలేదు.
This post was last modified on September 5, 2020 4:50 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…