సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ వెళ్ళాక దాని గురించి రకరకాల కథలు వచ్చాయి. రాజమౌళితో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం వెళ్లాడని, అక్కడేదో వర్క్ షాప్ జరుగుతుందని ఏదేదో అల్లేశారు. కట్ చేస్తే జక్కన్న ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. వరసగా రెండు రోజుల్లో గుంటూరు కారం, హనుమాన్ చూసేశారు. ఒకవేళ ప్రచారం జరిగిన వార్త నిజమే అయితే ఆయనా విదేశంలోనే ఉండాలి. అయితే అసలు కారణం వేరే ఉందట. డాక్టర్ హ్యారీ కొనిగ్ జర్మనీలో బాగా పాపులర్. బ్రెన్నెర్స్ పార్క్ హోటల్ అండ్ స్పాలో ప్రత్యేక కన్సల్టేషన్లు చేస్తుంటారు. చాలా ఖరీదైన వైద్యుడు.
గుంటూరు కారం కోసం గత మూడు నెలలుగా రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొని డాన్సులు ఫైట్లు చేసిన మహేష్ తన బాడీ ఫిట్ నెస్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల కోసం హ్యారీని కలుసుకున్నాడు. శారీరక దృఢత్వానికి సంబంధించిన ముఖ్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటున్నాడు. షార్ట్ ట్రిప్ అయినప్పటికీ వీలైనంత గైడెన్స్ తీసుకుని దాన్ని తిరిగి వచ్చాక ఇంట్లో అమలు పరచబోతున్నాడు. రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడేదే. ఫైనల్ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యంలో ఉగాదికి ఓపెనింగ్ చేస్తారని టాక్.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. క్యాస్టింగ్ సంబంధించి ఎలాంటి లీక్స్ బయటికి రావడం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఇతర బాషా నటులు ఇందులో భాగం కాబోతున్నారు. ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి, మహేష్ లు స్వయంగా చెప్పే దాకా వీటికి సంబంధించిన స్పష్టత వచ్చేలా లేదు.
This post was last modified on January 23, 2024 6:58 am
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…