బలగం అనే సినిమాను అనౌన్స్ చేసినపుడు దాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చేసిన కమెడియన్ వేణు దర్శకుడు అంటే ఆ సినిమాను మరింత లైట్ తీసుకున్నారు. కానీ ఆ సినిమా చూసి కదిలిపోయిన ప్రేక్షకులు వేణు దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయిపోయారు.
ఇతడిలో ఇంత డెప్త్ ఉందా అని ఆశ్చర్యపోయారు. వేణు స్ఫూర్తితో ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా మారుతున్నాడు. అతనే.. ధనరాజ్. వేణుతో పాటే అతను కూడా జబర్దస్త్‌లో కామెడీ స్కిట్లు చేశాడు. సినిమాల్లోనూ కామెడీ వేషాలు వేశాడు. కొన్ని నెలల కిందటే దర్శకుడిగా అతడి తొలి సినిమా అనౌన్స్ అయింది. తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సమాచారం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఇక ఈ రోజే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. రామం రాఘవం అనే ఆసక్తికర టైటిల్ పెట్టి ఒక స్ట్రైకింగ్ పోస్టర్ వదిలింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్‌లో సముద్రఖని, ధనరాజ్‌ల క్లోజప్ లుక్స్ ఇంటెన్స్‌గా అనిపిస్తున్నాయి. పోస్టర్లో బ్లాక్ అండ్ వైట్ థీమ్ కూడా ఆకట్టుకుంది. సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇద్దరు పాత్రధారుల పేర్లతోనే టైటిల్ పెట్టినట్లున్నారు. మొత్తంగా ఫస్ట్ ఇంప్రెషన్లో ధనరాజ్ మంచి మార్కులే కొట్టేశాడు.
ఒకేసారి తెలుగుతో పాటు తమిళ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా.. కోలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి స్పందనే కనిపిస్తోంది. పోస్టర్లో ఉన్న ఆసక్తి సినిమాలోనూ ఉంటే.. రామం రాఘవం మరో బలగం అయ్యే ఛాన్సుంది. పృథ్వీ పోలవరపు అనే కొత్త నిర్మాత స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బేనర్ మీద ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on January 22, 2024 8:48 pm
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…