హిట్టు కోసం తపించిపోతున్న అక్కినేని అభిమానులకు ఊరట కలిగేలా నా సామిరంగ విజయం సాధించింది. రెండు వారాలు పూర్తి కాకుండానే బ్రేక్ ఈవెన్ దాటేయడం నాగార్జున చాలా గ్యాప్ తర్వాత సాధించారు. ట్రేడ్ టాక్ ప్రకారం పద్దెనిమిది కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న నా సామిరంగ ఇప్పటికే ఆ మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టే కోటి లాభంలో ఉంది. గ్రాస్ కొంచెం అటుఇటుగా ముప్పై అయిదు కోట్లకు దగ్గరగా ఉందని సమాచారం. బంగార్రాజు తర్వాత సక్సెస్ లేక వైల్డ్ డాగ్, ఘోస్ట్ లు తీవ్రంగా నష్టపరడం నాగ్ ని విపరీతమైన ఆలోచనలో పడేసి నా సామిరంగను ఎంచుకునేలా చేసింది.
లెక్కల సంగతి ఓకే కానీ ఈ సినిమాని ఇంకా పెద్ద రేంజ్ లో ఊహించుకున్నారు నాగార్జున. బ్లాక్ బస్టర్ ని మించి ఆడుతుందని, సోగ్గాడే చిన్ని నాయనను అందుకుంటుందని ఆశించారు. కానీ ప్రాక్టికల్ గా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా చోట్ల నెమ్మదించింది. ముఖ్యంగా నైజామ్, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో డ్రాప్ ఎక్కువగా ఉందని డిస్టిబ్యూటర్ల మాట. ఒకవేళ టాక్ కనక అలాగే కొనసాగి ఉంటే హనుమాన్ తర్వాత బెస్ట్ ఛాయస్ ఇదే కాబట్టి కనీసం వారం పది రోజులు హౌస్ ఫుల్ బోర్డులు ఉండేవని అభిప్రాయపడుతున్నారు. అయినా సరే వసూళ్లని తక్కువగా చూడటం లేదు.
ఒకవేళ నా సామిరంగలో అన్ని ఎలిమెంట్స్ ఇంకాస్త జాగ్రత్తగా బ్యాలన్స్ అయ్యుండి, పాటలు కనక వైరలయ్యే స్థాయిలో ఉంటే కింగ్ ర్యాంపేజ్ ఇంకో స్థాయిలో ఉండేదన్న మాట వాస్తవం. నాగ్ ప్రేమకథకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సెకండ్ హాఫ్ లో అల్లరి నరేష్ ఎపిసోడ్ మీదే ఎమోషన్ భారాన్ని తోసేయడంతో మిగిలిన అంశాలకు చోటు లేకుండా పోయింది. దీనికి తోడు కీరవాణి నేపధ్య సంగీతం ఎంత బాగా ఎలివేట్ చేసినా ఒకటి మినహాయించి పాటలు సోసో అనిపించుకోవడం దెబ్బ కొట్టింది. దీని ఫలితం సంతృప్తిపర్చడంతో ఇకపై కూడా నాగార్జున ప్రయోగాలకు స్వస్తి చెప్పి ఓన్లీ మాస్ అంటున్నారట.
This post was last modified on January 22, 2024 6:54 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…