కావ్య థాపర్.. దక్షిణాది సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో ముంబై భామ. మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె.. రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ మాయ పేరేమిటో అనే చిన్న సినిమాతో తెలుగులో కథనాయకగా పరిచయమైంది. ఇలాంటి ఓ సినిమా వచ్చినట్లు కూడా జనాలకు పెద్దగా తెలియదు.
ఆ తర్వాత సంతోష్ శోభన్ సరసన చేసిన ఏక్ మినీ కథ కావ్యకు ఒక మాదిరి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాకపోతే ఆ సినిమాకు థియేటర్ రిలీజ్ లేదు. నేరుగా ఓటిటిలోనే రిలీజ్ అయింది. కాబట్టి నిఖార్సైన హిట్ కొట్టినట్లు కాదు. మధ్యలో తమిళంలో రెండు మూడు సినిమాలు చేసిన కావ్యకు అక్కడా సరైన విజయం దక్కలేదు.
అయితే కావ్య ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా ఆమెకు రెండు పేరున్న సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అవే ఈగల్, ఊరి పేరు భైరవకోన. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికే రిలీజ్ కావలసిన ఈగల్ చివరి నిమిషంలో ఫిబ్రవరి 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అదే తేదీకి ఆల్రెడీ ఊరి పేరు భైరవకోన షెడ్యూల్ అయి ఉంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతానికైతే ఒకే డేట్ కి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇలా రెండు క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించడం, అవి రెండూ ఒకే రోజు రిలీజ్ కావడం అరుదైన విషయమే. ఈ రెండు చిత్రాల్లోనూ కావ్య పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసినట్లు కనిపిస్తోంది.
గత ఏడాది సంక్రాంతికి ఒక రోజు వ్యవధిలో శృతిహాసన్ చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి రిలీజ్ అయ్యాయి. రెండు పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో కావ్య నటించిన రెండు సినిమాలు.. సక్సెస్ అయి ఆమె కెరీర్ కు ఊపు తెస్తాయేమో చూడాలి.
This post was last modified on January 22, 2024 10:43 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…