హనుమాన్ సినిమా రిలీజ్ టైంలో థియేటర్ల కేటాయింపు పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో కేవలం నాలుగు అంటే నాలుగు డొక్కు థియేటర్లు ఇచ్చారు ఆ చిత్రానికి. మల్టీప్లెక్సుల్లో కూడా చాలినన్ని షోలు పడలేదు. కొన్నిచోట్ల ఆల్రెడీ హనుమాన్ కు అగ్రిమెంట్ అయిన సింగిల్ థియేటర్లను కూడా తీసి వేరే చిత్రానికి ఇచ్చేశారు.
ఈ ఇబ్బందులన్నీ చాలవన్నట్లు ఏషియన్ మూవీస్ సంస్థ.. థియేటర్ల విషయంలో గొడవ చేస్తున్నందుకు హనుమాన్ టీంను తప్పుబడుతూ తమ స్క్రీన్ల నుంచి హనుమాన్ షోలను తీసేసింది. రిలీజ్ కి ముందు రోజు ఏఎంబి సహా ఆ సంస్థ స్క్రీన్లలో పెయిడ్ ప్రీమియర్లు పడలేదు.
తర్వాత వ్యవహారం సద్దుమణిగి అన్నిచోట్ల హనుమాన్ రన్ అయింది. అయితే విడుదల తర్వాత హనుమాన్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తోందో తెలిసిందే. అంతకుముందు హనుమాన్ ను దూరం పెట్టిన చాలా థియేటర్లలో ఈ సినిమానే ఆడుతూ వసూళ్ల పంట పండిస్తోంది.
ఇంకో విశేషం ఏంటంటే రిలీజ్ ముంగిట హనుమాన్ సినిమాను పక్కన పెట్టిన ఏషియన్ సంస్థ.. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో ఒక పెద్ద మల్టీప్లెక్స్ ను హనుమాన్ మూవీతోనే మొదలుపెట్టింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హనుమాన్ హీరో తేజ ముఖ్యఅతిథిగా హాజరు కావడం విశేషం.
ముందు తమ చిత్రాన్ని కాదనుకున్న సంస్థ..ఇప్పుడు అదే సినిమాతో పెద్ద మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడం.. అందులో ఆ సినిమా హీరో పాల్గొనడం చూసి ఇది కదా సక్సెస్ అంటే అని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు
This post was last modified on January 21, 2024 10:02 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…