టాలీవుడ్ సెలబ్రెటీల్లో చాలామంది కొత్త సినిమా రిలీజైనపుడు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లి 8.45 షో చూస్తుంటారు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా అక్కడికెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఇష్టం. తన సన్నిహితుల సినిమాలు లేదంటే తన దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రిలీజైనపుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయనక్కడ సినిమా చూస్తుంటారు.
ఆ తర్వాత ట్విట్టర్లో షార్ట్ రివ్యూలు కూడా ఇస్తుంటారు. దర్శకుడిగా తిరుగులేని స్థాయికి ఎదిగాక కూడా రాజమౌళి ఐమాక్స్‌కు వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూడటం ఆపేయలేదు. ఐతే లాక్ డౌన్ వచ్చి అందుకు అవకాశం లేకుండా చేసింది.
గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన రాజమౌళి ఓటీటీ కంటెంట్ చూస్తున్నాడు. తాజాగా ఆయన ఓ కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడు. రాజమౌళే కాదు.. ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి హోమ్ థియేటర్లో ఓ సినిమా చూశారు. అదే.. వి.
నిన్న రాత్రే ‘వి’ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తన ఇంట్లోని హోమ్ థియేటర్లో రాజమౌళి చూశాడు. ఆయనతో పాటు సినిమా చూసిన వాళ్ల సంఖ్య పెద్దదే. భార్య రమ రాజమౌళి, కొడుకు కార్తికేయ, కీరవాణి కొడుకులు కాలభైరవ, సింహా, జక్కన్నకు సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి.. ఇంకా పలువురు ‘వి’ సినిమా చూశారు. మొత్తం నంబర్ డబుల్ డిజిట్లోనే ఉంది. రాజమౌళికి నాని అంటే ఎంతో అభిమానం.
దాదాపుగా అతడి ప్రతి సినిమా చూస్తాడు. ఆరు నెలలుగా థియేటర్లు మూతబడి ఉండగా.. ఓటీటీల్లో నేరుగా కొన్ని చిన్న తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఐతే ‘వి’ ఇలా రిలీజవుతున్న మొదటి పెద్ద సినిమా. అందుకే జక్కన్న కుటుంబం సగటు ప్రేక్షకుల్లాగే ఆసక్తిగా ఈ సినిమా చూసింది. ఐతే ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. రాజమౌళి కూడా ట్విట్టర్లో రివ్యూ ఏమీ ఇవ్వకపోవడాన్ని బట్టి ఈ సినిమా ఆయనకూ నచ్చలేదని అర్థమవుతోంది.
This post was last modified on September 5, 2020 6:02 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…