కొన్నేళ్ల కిందటే టాలీవుడ్లోకి అడుగుపెట్టి మిడ్ రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి. గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన సిటీమార్ ఆయన తొలి చిత్రం. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించాయి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అంతిమంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత శ్రీనివాసా వరుసగా వారియర్, కస్టడీ, స్కంద సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఇవి మూడు డిజాస్టర్లే అయ్యాయి. స్కంద బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఓ హడావిడి చేశారు కానీ చివరికి అది కూడా డిజాస్టర్ అయింది. వరుసగా నాలుగు సినిమాలు తేడా కొడితే ఏ నిర్మాత అయిన నిలదొక్కుకోవడం కష్టమే. ఇంకో ఫ్లాప్ పడితే శ్రీనివాస పరిస్థితి అయోమయం అయ్యేది. అయితే ఆయన్ని సంక్రాంతి సినిమా నా సామి రంగ ఆదుకుంది.
అక్కినేని నాగార్జున పక్కా ప్లానింగ్ తో చేసిన ఈ సినిమా శ్రీనివాసా చిట్టూరికి తొలిసారిగా లాభాలు అందించింది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు శ్రీనివాసా. ఆయన పెట్టిన బడ్జెట్ మొత్తం దాదాపుగా నాని థియేత్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేసింది. మిగతాదంతా లాభమే. రిలీజ్ తర్వాత మంచి రెవెన్యూ రావడంతో కొంచెం ఓవర్ ఫ్లోస్ రూపంలో ఆయనకు మరింత ఆదాయం వచ్చింది.
ఇంతకుముందు స్కంద లాంటి సినిమాలకు ఆయనకు బిజినెస్ బాగానే జరిగినా చివరికి బయ్యర్లను బయట పడేయడానికి చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. నా సామి రంగ పరిమిత బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి కావడం.. రిలీజ్ ప్లానింగ్ పక్కాగా ఉండడం.. సంక్రాంతి సీజన్లో సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాగా ఆరడంతో శ్రీనివాసకు పెద్ద రిలీఫ్ దక్కినట్లు అయింది. ఈ ఊపులో ఆయన మరికొన్ని సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
This post was last modified on January 21, 2024 9:37 am
సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…