టాలీవుడ్లో ఒక ఆసక్తికర కాంబినేషన్లో సినిమా మొదలైంది. ఆనంద్ మొదలుకొని లవ్ స్టోరీ వరకు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర చేయబోతుండడం విశేషం. రష్మిక మందన్న ధనుష్ సరసన కథానాయకగా నటించబోతోంది. కమ్ముల చివరి సినిమా లవ్ స్టోరీని నిర్మించిన సునీల్ నారంగే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. దేవదాస్ మూవీ తర్వాత మరోసారి నాగార్జున నటిస్తున్న చిత్రంలో రష్మిక కూడా కనిపించబోతుండడం విశేషం. శేఖర్ కమ్ముల తీస్తున్న తొలి మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో దీని పట్ల ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇది ఒక గ్యాంగ్ స్టార్ మూవీ అని.. శేఖర్ కమ్ముల తొలిసారి యాక్షన్ ప్రధానంగా సినిమా చేస్తున్నాడని అంటున్నారు. విశేషం ఏంటంటే నాగార్జున ధనుష్ కాంబినేషన్లో ఇంతకుముందే ఓ సినిమా రావాల్సింది. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘పవర్ పాండి’ ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్.. దీని తర్వాత ‘రుద్ర’ పేరుతో ఒక భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అందులో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్ర పోషించాల్సింది. కానీ బడ్జెట్, ఇతర సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది.
ఆ తర్వాత గత ఏడాది తన శ్రీధర్శంలో వేరే సినిమా మొదలుపెట్టాడు ధనుష్. అందులో నాగార్జున ఏమి నటించలేదు. కానీ ధనుష్ నాగార్జున కాంబినేషన్ శేఖర్ కమ్ముల కార్యరూపం దాల్చేలా చేశాడు. బహుశా ఇందులో ధనుష్ ప్రోద్బలం కూడా ఉండి ఉండొచ్చు. తన దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమాలో నాగర్జునతో కలిసి నటించకపోయినా. కమ్ముల సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 19, 2024 9:29 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…