ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా చెప్పుకుంటున్న కల్కి 2898 ఏడి ఇంకో మూడున్నర నెలల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మే 9 రిలీజ్ డేట్ ని సంక్రాంతి పండగ సందర్భంగా అఫీషిషియల్ గా అనౌన్స్ చేశారు. వైజయంతి బ్యానర్ కు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సెంటిమెంట్ దానికి ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ వదలకూడదని నిర్మాత అశ్వినిదత్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగూ రెండు భాగాలు కాబట్టి ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూట్ దాదాపుగా పూర్తి చేసిన దర్శకుడు నాగఅశ్విన్ ఇంకోవైపు ఇంటర్నేషనల్ ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు.
ఇందులో రెండు ప్రత్యేక అతిథి పాత్రలు ఉంటాయని లేటెస్ట్ అప్డేట్. దుల్కర్ సల్మాన్ క్యామియో చేయడం గురించి గతంలోనే లీక్ వచ్చింది కానీ కొన్ని ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు అతను దాటవేశాడు. టీమ్ నుంచి ప్రకటన వచ్చే దాకా దాని గురించి నోరు విప్పడు కాబట్టి వెయిట్ చేయాలి. ఇక రెండో గెస్టు విజయ్ దేవరకొండని వినికిడి. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నాగ అశ్విన్ తో తనకు బాండింగ్ ఉంది. ఈ కారణంగానే మహానటిలో చిన్న పాత్ర, జాతి రత్నాలులో కొన్ని సెకండ్లు కనిపించే బిట్ చేశాడు. ఇప్పుడు కల్కిలో అంత సింపుల్ గా కాకుండా చెప్పుకోదగ్గ లెన్త్ పెట్టారట.
ఇప్పటికే ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానిలతో క్యాస్టింగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచేయగా ఇప్పుడీ స్పెషల్ అతిథులతో రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ గత నాలుగు సినిమాలు చెప్పిన డేట్ కి రాలేక వాయిదాల పాలై కొత్త తేదీలకు థియేటర్లలో అడుగు పెట్టాయి. కానీ కల్కి 2989 ఏడికి ఆ సమస్య రాకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారట. ఆల్రెడీ సంక్రాంతి అనుకుని తర్వాత మేకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ప్రమోషన్లు పెంచబోతున్నారు.
This post was last modified on January 18, 2024 1:51 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…