ఒక స్టార్ హీరో 75వ సినిమా అంటే మర్చిపోలేని మైలురాయిగా మిగలాలి. కానీ సైంధవ్ విషయంలో నిరాశ తప్పడం లేదు. ఈ మూవీ కోసం వెంకటేష్ విపరీతంగా కష్టపడ్డారు. సుదీర్ఘమైన నైట్ షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. టైంకి షూటింగ్ పూర్తయ్యేలా ఎక్కువ డేట్లు ఇచ్చారు. ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక యాక్టివ్ ప్రమోషన్లు చేశారు. కాలేజీలకు వెళ్లడం, ఈవెంట్లు హాజరు కావడం, శాటిలైట్ హక్కులు కొన్న ఛానల్ కోసం ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. చిరంజీవి అతిధిగా వెంకీ 75 వేడుకను ఘనంగా నిర్వహిస్తే రానా అండగా దానికీ ముందుండి నడిపించారు.
ఇంత చేసినా సైంధవ్ సంక్రాంతి బరిలో నిలవలేకపోతోంది. గోదావరి, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొంత పర్వాలేదు కానీ నైజామ్, సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అనేలా ఎదురీదుతోంది. నిజానికి దీని విషయంలో రెండు తప్పులు జరిగాయి. ఏదో ట్రెండ్ ఉందని గుడ్డిగా యాక్షన్ కథ రాసుకున్న దర్శకుడు శైలేష్ కొలను ట్రీట్ మెంట్ ని సరైన రీతిలో తెరకెక్కించకపోవడంతో పాప ఇంజెక్షన్ చుట్టూ నడిపించిన డ్రామా బోర్ కొట్టించేసింది. పైగా ఎమోషన్ పేరుతో సాగదీసిన సన్నివేశాలు ప్రేక్షకులను సహనంగా కూర్చోబెట్టలేకపోయాయి. లోకేష్ కనగరాజ్ స్టైల్ లో ఏదో ట్రై చేద్దామని బోర్లా పడ్డారు.
ఇంకో అది పెద్ద మిస్టేక్ సంక్రాంతి రిలీజ్ కి సైంధవ్ ని దింపడం. పండక్కు కమర్షియల్ మసాలాలకే ఎక్కువ ఆదరణ ఉంటుందని తెలిసి కూడా రిస్క్ చేశారు. హనుమాన్ ని తక్కువంచనా వేయడం సమూలంగా దెబ్బ కొట్టింది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే సైంధవ్ బ్లాక్ బస్టర్ అయ్యేది కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితి కన్నా డీసెంట్ వసూళ్లు, ఫీడ్ బ్యాక్ తెచ్చుకునేది. ఇప్పుడు ఏకంగా డిజాస్టర్ ముద్ర ప్రమాదంలో పడింది. గుంటూరు కారంని మహేష్ బాబు ఇమేజ్ అడ్డుగోడలా కాపాడింది కానీ అదే తరహాలో సైంధవ్ ని వెంకీ నిలబెట్టలేకపోయారు. ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
This post was last modified on %s = human-readable time difference 1:34 pm
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…