అక్కినేని హీరోలు అన్నపూర్ణ స్టూడియోస్‍తో పాటు మనం ఎంటర్‍టైన్‍మెంట్స్ అంటూ మరో బ్యానర్ కూడా స్థాపించారు. ఆ సంస్థపై వరుసగా సినిమాలు వస్తాయనే అభిమానులు భావించారు. కానీ స్వీయ నిర్మాణంలో వున్న తలనొప్పులు నాగార్జునకు నచ్చడం లేదు. తాను నిర్మించే సినిమాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని నాగార్జున అనుకుంటారు. గతంలో ఆయన హీరోగా నటించిన సినిమాలు మాత్రమే నిర్మించేప్పుడు అది కష్టం కాలేదు.
కానీ తనయులు హీరోలయ్యాక వారి సినిమాల నిర్మాణంలో పూర్తిగా ఇన్‍వాల్వ్ అవడం కుదరడం లేదు. అదీ కాక తనకు మంచి పారితోషికం ఆఫర్ చేస్తున్నారు. చైతన్యకు కూడా అయిదు కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నారు. అఖిల్ ఇంకా బ్యాంకబుల్ స్టార్ కాకపోయినా కానీ అతనికీ పారితోషికం బాగానే ఇస్తున్నారు. ఇలా నటిస్తే కోట్లు వచ్చి పడుతున్నపుడు నిర్మాణం చేపట్టి ఆ రిస్క్ అంతా ఎందుకు భరించాలని నాగార్జున డిసైడ్ అయ్యారు.
అందుకే నిర్మాణానికి దూరంగా వుంటూ చివరకు తనయుల చిత్రాలు నిర్మించడానికి కూడా ససేమీరా అనేస్తున్నారు. నాగార్జున ఇదే మైండ్‍సెట్‍తో వుంటే లాక్‍డౌన్‍కి ముందు ప్లాన్ చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ సినిమా బహుశా ఇక వుండకపోవచ్చు.
This post was last modified on September 5, 2020 12:14 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…