పెళ్లి తర్వాత పెద్ద సినిమాలలో సమంతకు అవకాశాలు రావడం లేదు. నాగచైతన్య సినిమాలలో పదే పదే ఆఫర్స్ వస్తున్నాయి కానీ వాళ్లిద్దరూ తరచుగా కలిసి నటించడం బాగోదని వాళ్లే వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. అయితే చిన్న సినిమాలు కూడా ఏవి పడితే అవి చేయకూడదని, నటిగా పది కాలాల పాటు గుర్తుండిపోయే పాత్రలు మాత్రమే ఓకే చేయాలని సమంత డిసైడ్ అయింది. అందుకే ఓ బేబీ తర్వాత సమంత చాలా సెలక్టివ్‍గా సినిమాలు ఒప్పుకుంటోంది.
దీంతో ఆమె ఇక నటించదేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ సమంతకు మాత్రం డబ్బుల కోసమే సినిమాలు చేయాలని లేదు. అందుకే తనకు వచ్చే ఆఫర్లు ఎంత చిన్న సినిమాలలో అయినా ఆమె ఖాతరు చేయడం లేదు. కథ నచ్చితే పారితోషికం విషయంలో పట్టింపులు వుండవనే ఆమె మేనేజర్లు కూడా చెబుతున్నారు. కీర్తి సురేష్ చాలా తక్కువ చిత్రాలతో నేషనల్ అవార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. మహానటిలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన సమంత తాను కూడా నటిగా ఉత్తమ పురస్కారం అందుకోవాలని చూస్తోంది.
‘గేమ్ ఓవర్’ దర్శకుడు అశ్విన్ శరవణన్‍తో సినిమా చేస్తోన్న సమంత అందులో మూగ, చెవిటి పాత్ర చేస్తోంది. ఈ చిత్రం తన కల నెరవేరుస్తుందని ఆమె ఆశిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. తెలుగు, తమిళ భాషలలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
This post was last modified on September 5, 2020 12:05 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…