నేషనల్‍ అవార్డ్ పై కన్నేసిన సమంత!

పెళ్లి తర్వాత పెద్ద సినిమాలలో సమంతకు అవకాశాలు రావడం లేదు. నాగచైతన్య సినిమాలలో పదే పదే ఆఫర్స్ వస్తున్నాయి కానీ వాళ్లిద్దరూ తరచుగా కలిసి నటించడం బాగోదని వాళ్లే వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. అయితే చిన్న సినిమాలు కూడా ఏవి పడితే అవి చేయకూడదని, నటిగా పది కాలాల పాటు గుర్తుండిపోయే పాత్రలు మాత్రమే ఓకే చేయాలని సమంత డిసైడ్‍ అయింది. అందుకే ఓ బేబీ తర్వాత సమంత చాలా సెలక్టివ్‍గా సినిమాలు ఒప్పుకుంటోంది.

దీంతో ఆమె ఇక నటించదేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ సమంతకు మాత్రం డబ్బుల కోసమే సినిమాలు చేయాలని లేదు. అందుకే తనకు వచ్చే ఆఫర్లు ఎంత చిన్న సినిమాలలో అయినా ఆమె ఖాతరు చేయడం లేదు. కథ నచ్చితే పారితోషికం విషయంలో పట్టింపులు వుండవనే ఆమె మేనేజర్లు కూడా చెబుతున్నారు. కీర్తి సురేష్‍ చాలా తక్కువ చిత్రాలతో నేషనల్‍ అవార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. మహానటిలో సపోర్టింగ్‍ క్యారెక్టర్‍ చేసిన సమంత తాను కూడా నటిగా ఉత్తమ పురస్కారం అందుకోవాలని చూస్తోంది.

‘గేమ్‍ ఓవర్‍’ దర్శకుడు అశ్విన్‍ శరవణన్‍తో సినిమా చేస్తోన్న సమంత అందులో మూగ, చెవిటి పాత్ర చేస్తోంది. ఈ చిత్రం తన కల నెరవేరుస్తుందని ఆమె ఆశిస్తోంది. ఇందులో విజయ్‍ సేతుపతి ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. తెలుగు, తమిళ భాషలలో రూపొందే ఈ చిత్రం షూటింగ్‍ త్వరలోనే మొదలు కానుంది.