కొన్ని వారాలు ముందు వరకు హనుమాన్ అంటే ఓ చిన్న సినిమా. కానీ విడుదలకు కొన్ని రోజుల ముందే దీని రేంజ్ వేరని అర్థం అయింది. ఇక విడుదల తర్వాత ఈ సినిమా ఎవరు ఊహించని రేంజికి వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు హనుమాన్ టార్గెట్లు మారిపోతున్నాయి. ఆల్రెడీ వరల్డ్ వైడ్ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది హనుమాన్.
సినిమా విడుదలై ఐదు రోజులు దాటిపోయినా.. వీక్ డేస్ లోకి అడుగుపెట్టిన ఊపేమి తగ్గట్లేదు. ఇప్పటికీ హనుమాన్ టికెట్లు దొరకడం గగనంగానే ఉంది. హౌస్ ఫుల్స్ కొనసాగుతున్నాయి. దీంతో అంతిమంగా ఏ ఏరియాల్లో హనుమాన్ ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ వసూళ్లు నిలకడగా ఉన్నాయి.
క్రమక్రమంగా థియేటర్లు, షోలు పెరుగుతున్నాయి. కనీసం ఇంకో రెండు వారాలు సినిమా జోరు కొనసాగేలా కనిపిస్తోంది. దీంతో కేవలం ఏపీ, తెలంగాణ వరకే సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబడితే ఆశ్చర్యం లేదు. మరోవైపు హిందీ వర్షన్ వసూలు అంతకంతకు పెరుగుతున్నాయి. అక్కడ ఈజీగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసేలా కనిపిస్తోంది హనుమాన్.
సినిమా ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్ళినా వెళ్లొచ్చు. ఇక అమెరికాలో ఆల్రెడీ 3 మిలియన్ మార్కును అందుకుంది హనుమాన్. ప్రస్తుతానికి టార్గెట్ నాలుగు మిలియన్లు. దాన్ని అందుకుంటే నాన్-రాజమౌళి, నాన్- ప్రభాస్ రికార్డు సొంతమైనట్లే. జోరు కొనసాగితే ఐదు మిలియన్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఫుల్ రన్లో 300 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
This post was last modified on January 17, 2024 7:03 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…