టాక్, రివ్యూల సంగతి ఎలా ఉన్నా మహేష్ బాబు బ్రాండ్ గుంటూరు కారంని చాలా బలంగా లాగుతోంది. ఒక మీమ్ వీడియోలో చూపించినట్టు ఒక ట్రైన్ ఎత్తున్నున్న బ్రిడ్జ్ నుంచి పడిపోతుంటే కాపాడిన స్పైడర్ మ్యాన్ లా సూపర్ స్టార్ ఇమేజ్ కంచు కోటలా నిలుస్తోంది. రిలీజ్ కు ముందు ఈవెంట్ మినహా సితార సంస్థ ఇంకెలాంటి ప్రమోషన్లు చేయలేదు. నెలల క్రితమే ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చిన నిర్మాత నాగవంశీ సైలెంటయ్యారు. విడుదల తర్వాత దిల్ రాజుతో ప్రెస్ మీట్ పెట్టారు కానీ రెండు మూడు పొడిపొడి మాటలతో మమ అనిపించారు అంతే. కట్ చేస్తే నిన్న మహేష్, శ్రీలీలతో యాంకర్ సుమ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి వదిలారు తప్పించి అంతకు మించి ఎలాంటి పబ్లిసిటీ మూమెంట్ ప్రస్తుతానికి కనిపించడం లేదు.
ఈ మొత్తం సీన్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ మీడియాకి అందుబాటులోకి రావడం లేదు. అడగాలే కానీ తమన్ కెమెరా ముందుకొచ్చి బోలెడు సంగతులు పంచుకుంటాడు. గతంలో వేరే సినిమాలకు ఉత్సాహంగా పాల్గొనడం చూశాం. కానీ గుంటూరు కారం విషయంలో మాత్రం ట్విట్టర్ లో తప్ప అవుట్ డోర్ లో కనిపించడం లేదు. త్రివిక్రమ్ సైతం ఏదైనా ప్రత్యేక ముఖాముఖీ లాంటిది చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే ఎలా ఉండేదేమో కానీ ఈ ఇద్దరీ ఆబ్సెంట్ ని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు వచ్చాక కానీ దర్శన భాగ్యం కలిగేలా లేదు.. అదెంత వరకు సాధ్యమో తేలాలంటే కనీసం ఇంకో వారం ఎదురు చూడక తప్పదు.
ఇవాళ వదిలిన అఫీషియల్ పోస్టర్ లో ఎలాంటి బాక్సాఫీస్ నెంబర్లు చెప్పలేదు. క్షేత్ర స్థాయిలో కలెక్షన్లు మరీ తీసికట్టుగా లేవు కానీ టికెట్ రేట్ల వల్ల నైజామ్ లో నెమ్మదించడం ప్రభావం చూపిస్తోంది. తగ్గించే దిశగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది కానీ మొదటి వారం మొత్తం అవే రేట్లు ఉండాలని నిర్ణయించుకోవడంతో మల్టీప్లెక్సుల్లో ఆ దెబ్బ గట్టిగా పడుతోంది. ఒకవేళ సినిమా అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు ఎంత పెంపు ఉన్నా లెక్క చేయరు కానీ కొంచెం అటుఇటు అయినప్పుడు రాజీపడాలి. మరి సెకండ్ వీక్ ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి. మహేషే అంత ఫ్రీగా మనసులో మాటలను పంచుకున్నప్పుడు త్రివిక్రమ్, తమన్ కూడా వీలైనంత త్వరగా షేర్ చేసుకుంటే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారుగా.
This post was last modified on January 17, 2024 4:06 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…