ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ సిఈఓ హైదరాబాద్ వచ్చినప్పుడు మన స్టార్ హీరోలందరి ఇంటింకి వెళ్లి వాళ్ళతో టిఫిన్లు, భోజనాలు చేసి ఫోటోలు దిగడం ఎంత వైరలయ్యిందో చూశాం. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు కొంటే చాలు ఇండియా మార్కెట్ కి సరిపోతుందనుకునే స్టేజి నుంచి టాలీవుడ్ లో ఎంత బంగారం ఉందో అర్థం చేసుకునే స్థితికి సదరు కంపెనీ పెద్దలు వచ్చేశారు. అందుకే భారీ ఎత్తున వందల కోట్ల పెట్టుబడులతో 2024లో విడుదల కాబోతున్న క్రేజీ సినిమాల్లో అధిక శాతం కొనేశారు. వాటి తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్లతో తెలుగు మూవీ లవర్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర 1, అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్, విజయ్ దేవరకొండ 12, సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, బాలకృష్ణ 109, కార్తికేయ హీరోగా యాక్షన్ మూవీ(సితార బ్యానర్), సిద్దార్థ్-అదితి రావుహైదరి హరిలోరంగ హరి, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, అల్లు శిరీష్ టెడ్డి, ప్రభాస్ సలార్, ఎస్విసిసి 37, నితిన్ నార్నే 2 ఇప్పటిదాకా ప్రకటించిన లిస్టులో ఉన్నాయి. ఇంకొన్ని వచ్చినా ఆశ్చర్యం లేదు. కోలీవుడ్ కు సంబంధించిన నోట్స్ వేరుగా ఉంటాయి. ఎలా చూసుకున్నా కేవలం ఇక్కడ చెప్పిన వాటి ఓటిటి హక్కులు కొనేందుకు అయిదారు వందల కోట్లకు పైగానే నెట్ ఫ్లిక్స్ ఖర్చు పెట్టి ఉంటుంది.
దీన్ని బట్టి తెలుగు మార్కెట్ ఎంత విస్తృతంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయిన నెట్ ఫ్లిక్స్ దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంది. మన డిజాస్టర్లు సైతం భారీ సంఖ్యలో మిలియన్ వ్యూస్ తెచ్చి పెట్టాయి. పైగా బహుబాషల్లో టాలీవుడ్ సినిమాలకు రీచ్ ఎక్కువగా ఉండటంతో డిజిటల్ రేట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. పుష్ప 2 కోసం అమెజాన్ ప్రైమ్ ఎంత పోటీ ఇచ్చినా నిర్మాతలకు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చి మరీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. నెట్ ఫ్లిక్స్ పండగ క్యాప్షన్ కి నిజంగానే న్యాయం చేకూర్చారు.
This post was last modified on January 15, 2024 11:27 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…