బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తున్న హనుమాన్ తెలుగు నుంచి హిందీ దాకా అన్ని చోట్ల ఒకే రేంజ్ లో సునామి సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ లాంటి కొన్ని చోట్ల స్థానిక కారణాల వల్ల భారీ స్పందన లేదు కానీ మిగిలిన ప్రాంతాల్లో ర్యాంపేజ్ అనే మాట కరెక్ట్. దీనికి సీక్వెల్ ఉంటుందని, టైటిల్ జై హనుమాన్ ఫిక్స్ చేశామని ఎండ్ టైటిల్ కార్డులో ఆల్రెడీ చెప్పేసిన సంగతి తెలిసిందే. 2025 విడుదలని అందులో స్పష్టం చేయడంతో ఇప్పుడు ఫలితం చూశాక సీక్వెల్ అంచనాలు పెరుగుతున్నాయి. దీని గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
జై హనుమాన్ ప్రపంచం వేరుగా ఉంటుందట. తేజ సజ్జ ఉండే అంజనాద్రి చుట్టూ కాకుండా హనుమంతుడు రాముడికి ఏం మాట ఇచ్చాడు, విభీషణుడు చెప్పినట్టు ప్రపంచానికి రాబోయే ముప్పు ఏంటి అనే దాని చుట్టూ ఇంకా పెద్ద స్కేల్ లో చూపించబోతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తేజ సజ్జ ఉంటాడు కానీ ఫుల్ లెన్త్ రోల్ కాదని చెబుతున్నాడు. క్యాస్టింగ్ మొత్తం వేరే ఉంటారని, మొదటి భాగంలో కేవలం కొన్ని నిముషాలు మాత్రమే నిజ దర్శనం ఇచ్చిన హనుమాన్ ని ఈసారి పూర్తిగా చూపిస్తానని అంటున్నాడు. సినిమాటిక్ యునివర్స్ లో ఇదీ భాగమేనని అంటున్నాడు.
సో ఈ లెక్కన జై హనుమాన్ మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చో అర్థమవుతోంది. వచ్చే ఏడాది విడుదల ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ప్రశాంత్ వర్మకే క్లారిటీ లేదు. సంక్రాంతికి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే చేతిలో ఉన్న పదకొండు నెలల్లో ఇంత పెద్ద స్కేల్ తో ప్యాన్ ఇండియా మూవీ తీసి సిద్ధం చేయడం సులభం కాదు. పైగా ప్రశాంత్ వర్మ తీసిన మరో చిన్న బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రిలీజ్ కు రెడీగా ఉంది. దానికంటూ ఓ రెండు నెలలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే జై హనుమాన్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ అంచనాలు నిలబెట్టుకోవడమే ఛాలెంజ్.
This post was last modified on January 15, 2024 7:11 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…