Movie News

BMS ఫేక్ రేటింగులపై గుంటూరు కారం సీరియస్

ఉద్దేశపూర్వకంగా గుంటూరు కారంకు బుక్ మై షోలో ఎక్కువ నెగటివ్ రేటింగ్స్ వచ్చేలా ఒక బృందం పని చేసిందని ఫిర్యాదు చేస్తూ నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికి 6.6 రేటింగ్ ఉంది. మాములుగా జనం మొదటి రోజే తిరస్కరించిన డిజాస్టర్లకు సైతం 7 నుంచి 9 మధ్యలో ఉంటుంది. కానీ గుంటూరు కారం అంత దారుణంగా లేదని కలెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి. మిక్స్డ్ టాక్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఫ్యామిలీస్ దూరంగా ఉండే రేంజ్ అయితే కాదు. ఆ మాటకొస్తే యూత్ కన్నా కుటుంబ ప్రేక్షకులే ఎక్కువ వస్తున్నారు.

సుమారు 70 వేలకు పైగా ఇలా బాట్ టెక్నాలజీ వాడి రేటింగ్స్ ఇవ్వడం వల్ల అనవసరమైన నెగటివ్ ప్రాపగండా జరుగుతోందని హారికా హాసిని అభియోగం. నిజానికి ఈ బిఎంఎస్, ఐఎండిబి రేటింగులు దేనికీ ప్రామాణికం కావు. వాటిలో విశ్వసనీయత వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. ఆ మధ్య ఇండియన్ టాప్ 250 మూవీస్ లిస్టుని ప్రకటించినప్పుడు అందులో విశ్వనాథ్ గారి క్లాసిక్స్ ఒక్కటీ లేకపోవడం బట్టే చెప్పొచ్చు ఐఎండిబి ఏ పద్ధతి మీద రివ్యూలు చేస్తుందో. ఇప్పుడీ బుక్ మై షో స్కామ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టాల్సిన బాధ్యత సైబర్ క్రైమ్ మీద ఉంది. అంత సులభమైతే కాదు.

ఇలాంటివి కట్టడి చేయడం అవసరమే. భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు ఈ సమస్య మళ్ళీ మళ్ళీ తలెత్తే అవకాశం లేకపోలేదు. కొందరు ఈ రేటింగ్స్ చూసి టికెట్లు బుక్ చేసుకునే ట్రెండ్ ని ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఖచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం ఉంటుంది. తరచూ యూట్యూబ్ లోనూ ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గుంటూరు కారం టీమ్ కి ఎలాంటి న్యాయం జరుగుతోందో చూసి దాన్ని బట్టి భవిష్యత్తులో మిగిలిన నిర్మాతలు అలెర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి కొత్త తరహా స్కామ్ లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 

This post was last modified on January 15, 2024 2:13 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

51 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago