బింబిసార రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ట ప్రస్తుతం చిరంజీవితో భారీ ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర చేస్తున్న సంగతి తెలిసిందే. సెట్స్ లో ఇంకా హీరో అడుగుపెట్టలేదు కానీ ఆయన అవసరం లేని సీన్లను మిగిలిన ఆర్టిస్టులతో చకా చకా పూర్తి చేస్తున్నారు. హీరోయిన్లుగా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతికి ఏదైనా పోస్టర్ లేదా కీలక అనౌన్స్ మెంట్ ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్ అభిమానులను మరింత ఎగ్జైట్ చేసేలా ఉంది.
దాని ప్రకారం విశ్వంభరలో ఒక కీలక క్యామియో కోసం దీపికా పదుకునేని సంప్రదించారట. కథలో భాగంగా దొరబాబు (ప్రచారంలో ఉన్న చిరు పాత్ర పేరు) ఓ దేవకన్యని కలుస్తాడట. ఆ సందర్భంగా వచ్చే చిన్న ఎపిసోడ్లో స్పెషల్ సాంగ్ ఉంటుందట. కళ్ళు చెదిరే సెట్ల మధ్య భారీ కాస్ట్యూమ్స్ తో అప్సరసను తలదన్నే అందమైన భామతో చిరు డాన్స్ చేసే పాట కోసం ఆమెను అడిగినట్టు తెలిసింది. రెమ్యునరేషన్ ఎంతైనా పర్వాలేదనే రీతిలో యువి క్రియేషన్స్ సిద్ధంగా ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం దీపికా పదుకునే ప్రభాస్ సరసన కల్కి ఏడి 2898లో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అఫీషియలయ్యే దాకా ధృవీకరించలేం కానీ నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి కిక్కే. ప్రస్తుతం చిరంజీవి ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు. సంక్రాంతి అయ్యాక షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో దానికి అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ గ్యాప్ తీసుకున్న చిరు ఫిబ్రవరి నుంచి పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఎంఎం కీరవాణితో రెండు పాటల కంపోజింగ్ ఆల్రెడీ పూర్తయిపోగా బాలన్స్ ఉన్నవి మిగిలినవి త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. 2025 సంక్రాంతి విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు.
This post was last modified on January 11, 2024 2:10 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…