Movie News

సంక్రాంతి సమరానికి రంగం సిద్ధం

కొత్త ఏడాదిలో అసలైన బాక్సాఫీస్ సమరం రేపటి నుంచి మొదలు కాబోతోంది. పేరుకి జనవరి 12 రిలీజనే కానీ హనుమాన్ కి ఇవాళ సాయంత్రం నుంచి వేస్తున్న ప్రీమియర్లకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ స్పందన చూసి బయ్యర్లు షాకవుతున్నారు. హైదరాబాద్ లో రెండు వందల దాకా షోలు వేస్తే దాదాపు అన్నీ ముందస్తుగానే ఫుల్ అవుతున్నాయి. ఏపీ తెలంగాణ జిల్లా కేంద్రాల్లో రెండు షోలతో సరిపోతుందనుకుంటే ఏకంగా తొమ్మిది పైగా పెంచే పరిస్థితి నెలకొంది. రాత్రికి వచ్చే పాజిటివ్ టాక్ రేపటి నుంచి ఉపయోగపడుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. లాంగ్ రన్ ని టార్గెట్ చేసుకున్న హనుమాన్ కి ఇది చాలా కీలకం.

ఇక గుంటూరు కారం ర్యాంపేజ్ మాములుగా లేదు. టికెట్ రేట్ల మీద వంద రూపాయల పెంపున్నా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా మిడ్ నైట్ షోల డిమాండ్ చూస్తే ఎవరికైనా నోట మాట రాదు. ఒక్క భాగ్యనగరంలోనే 8 కోట్ల గ్రాస్ ఆల్రెడీ వచ్చేసిందని ట్రేడ్ రిపోర్ట్. బాగుందనే మాట వస్తే చాలు రికార్డుల ఊచకోత మాములుగా ఉండదు. శనివారం రాబోతున్న సైంధవ్ సౌండ్ చేయకుండా సైలెంట్ కిల్లర్ అవుతాడని వెంకటేష్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ట్రైలర్, పాటలు భీభత్సమైన హైప్ తేకపోయినా హీరో, దర్శకుడు చేస్తున్న ప్రమోషన్లు, చెబుతున్న విశేషాలు అంచనాలు పెంచుతున్నాయి.

చివరిగా ఆదివారం రిలీజ్ ఎందుకున్న నా సామిరంగ మీద నాగార్జున నమ్మకం మాములుగా లేదు. అతి తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంత పెద్ద క్యాస్టింగ్, కాన్వాస్ ని ఒక కొత్త దర్శకుడి చేతిలో పెట్టడం చిన్న విషయం కాదు. ఈ పండగ మాదే అంటూ పబ్లిసిటీని హోరెత్తిస్తున్నారు. దేనికవే విభిన్నమైన జానర్లు కావడంతో ప్రేక్షకుల పర్సులకు గట్టి చిల్లులు తప్పవు. ఒకవేళ అన్నీ బాగుంటే మాత్రం కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడుతూ పండగ శోభను తీసుకొస్తాయి. రెండు వందల కోట్ల దాకా ఈ నాలుగు సినిమాల మీద బిజినెస్ జరిగింది.

This post was last modified on January 11, 2024 4:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

47 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago