అక్కినేని నాగార్జున కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా.. నా సామి రంగ. 8 ఏళ్ల కిందట వచ్చిన సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఆయనకు సరైన విజయమే లేదు. దేవదాస్, బంగార్రాజు లాంటి చిత్రాలు ఓ మోస్తరుగా అడాయి కానీ నాగ్ కోరుకున్న హిట్ అయితే అందించలేదు. కొన్నేళ్లుగా నాగ్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నా సామి రంగతో పుంజుకోవాలని నాగ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రంపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు. బుధవారం జరిగిన నా సామిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్లో నా కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించింది.
సోగ్గాడే చిన్నినాయన టైంలో చెప్పినట్లే.. ఈసారి పండక్కి కొడుతున్నాం అంటూ అక్కినేని అభిమానులకు భరోసా ఇచ్చాడు నాగ్. ఈ సినిమాకి సంబంధించి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులు కూడా ఉన్నట్లు నాగ్ చెప్పడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ శతజయంతి జరిగిందని.. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నా సామిరంగా సినిమా చేయమంటూ తనకు తండ్రి మనసులో చెప్పినట్లు నాగ్ పేర్కొనడం విశేషం. నాగ్ ఈ మాట అనడంతో ఆడిటోరియం దద్దరిల్లింది.
ఇక తన ప్రసంగం చివర్లో సంక్రాంతి సినిమాలన్నిటికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు అక్కినేని హీరో. హీరోగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్, 75వ చిత్రంతో వస్తున్న మా వెంకీ, చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకు పరిచయం ఉన్న తేజ.. అంటూ ఒక్కొక్కరి పేర్లు ప్రస్తావించి వాళ్ళకి నాగ్ ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం.
This post was last modified on January 11, 2024 10:21 am
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…