నితిన్ సినిమాల సెలక్షన్ ఎలా ఉన్నా, హీరోయిన్ల సెలక్షన్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా ఇలియానా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశాడు నితిన్. అయితే ఇప్పుడు సొంత బ్యానర్‌లో చేస్తున్న సినిమాకు మాత్రం డిసెంట్ లుక్స్‌లో కనిపించే హీరోయిన్‌ను ఎంపిక చేయడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ‘భీష్మ’ ఇచ్చిన సక్సెస్ జోరుతో యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ డిఫెరెంట్ థ్రిల్లర్ మూవీని మొదలెట్టాడు నితిన్. అయితే ‘అంధాదున్’ రీమేక్‌లో హీరోయిన్‌గా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేశాడు నితిన్.
ప్రియాంక మోహన్ చాలా అందంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. టాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ మూవీ ‘గ్యాంగ్ లీడర్’లో ప్రియాంక మోహన్‌లో పద్ధతైన పక్కింటి అమ్మాయిలా కనిపించింది. ఎక్కడా గ్లామర్ దారబోయలేదు. మరి యూత్‌లో ఫాలోయింగ్ ఉన్న నితిన్ సినిమాలోనూ గ్లామర్ లేకపోతే ఎలా? అని డౌట్ పడుతున్నారు ఆయన ఫ్యాన్స్.
‘అంధాదున్’ హిందీ వర్షన్లో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించింది. గ్లామర్‌తో పాటు బోల్డ్ సీన్స్‌లోనూ రెచ్చిపోయి నటించింది. ఈ సీన్స్ మూవీకి ప్లస్ అయ్యాయి కూడా. మరి తెలుగులో ప్రియాంక మోహన్ ఇలాంటి సీన్స్‌లో నటిస్తుందా? అనే అందరి డౌట్.
మరి మొదటి సినిమాలో పద్ధతైన పాత్రలో నటించినా, చిట్టి పొట్టి దుస్తుల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ సిద్ధమేనని ఈ మధ్యనే సోషల్ మీడియా ద్వారా చెప్పింది. మరి గ్లామర్ లేని అంధుడు కథను చూస్తామా లేదంటే పద్దతి మార్చిన కొత్త హీరోయిన్ ను చూస్తామో తెలియాలంటే.. కాస్త వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on April 26, 2020 1:54 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…